ప్రతి ఒక్కరికి వేరు వేరు అభిప్రాయాలు ఉంటాయి. కొంత మంది కుటుంబానికి ప్రాముఖ్యతనిస్తారు. కొంత మంది కెరియర్ కి, ఇంకా కొంతమంది డబ్బుకి ఇలా ప్రతి మనిషి కొన్ని విషయాలను ఎక్కువగా పట్టించుకుంటారు కొన్ని విషయాలను వదిలేస్తారు.

Video Advertisement

కానీ ఈ అభిప్రాయాలు ఉండటానికి ముఖ్య కారణం గతంలో వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలే. అలా మన ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు 40 దాటినా కూడా వాళ్ల వ్యక్తిగత కారణాల వల్ల కెరియర్ కి ప్రాముఖ్యతనిచ్చి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. వాళ్ళలో కొంతమంది ఎవరంటే.

#1 టబు

ఎన్నో సంవత్సరాల నుండి ప్రేక్షకులను అలరిస్తున్నారు టబు. తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. కానీ ఇన్ని సంవత్సరాలు అయినా కూడా తన వ్యక్తిగత విషయాలకి సంబంధించిన వివరాలు ఎక్కువగా బయటికి రావు. టబు కూడా ఈ విషయాల గురించి బయట ఎక్కువగా మాట్లాడరు.

#2 సితార

సినిమాల్లోనే కాకుండా ఎన్నో సీరియల్స్ లో కూడా నటించారు సితార.సితార తన పెళ్లి గురించి ఒకసారి మీడియాతో మాట్లాడుతూ తను తన తండ్రికి చాలా క్లోజ్ అని, తల్లిదండ్రులను వదిలి వెళ్ళటం ఇష్టం లేక పెళ్లి చేసుకోలేదు అని. తన తండ్రి చనిపోయిన తర్వాత పెళ్లి ఆలోచన పూర్తిగా పోయింది అని అన్నారు.

heroines acted in mother roles in second innings

#3 వెన్నిరాడై (వెన్నిర ఆడై) నిర్మల

ఎన్నో తమిళ్, మలయాళం సినిమాలతో పాటు తెలుగులో శంకర్ దాదా ఎంబిబిఎస్, రగడ, కలిసుందాం రా, అధిపతి, సీమ సింహం ఇంకా ఎన్నో చిత్రాల్లో అలాగే రెండు కన్నడ చిత్రాలలో కూడా నటించారు నిర్మల. అంతేకాకుండా సీరియల్స్ లో కూడా నటించారు.

#4 నర్గీస్ ఫక్రీ

నర్గీస్ ఫక్రీ 2011లో వచ్చిన రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టారు. నర్గీస్ ఫక్రీ ఎక్కువగా హిందీ చిత్రాల్లో నటించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన జులాయి సినిమా తమిళ్ లో ప్రశాంత్ హీరోగా సాహసం పేరుతో రీమేక్ అయింది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేశారు నర్గీస్ ఫక్రీ.

#5 సుష్మితా సేన్

పరిచయం అక్కర్లేని వ్యక్తి సుష్మితా సేన్. సుష్మితా సేన్, రొమన్ షాల్ తో గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవల వీరి బ్రేకప్ అయినట్టు ప్రకటించారు.

#6 అమీషా పటేల్

హిందీలోనే కాకుండా తెలుగులో కూడా బద్రి, నాని, నరసింహుడు చిత్రాల్లో నటించారు అమీషా పటేల్. అమీషా పటేల్ రిలేషన్ షిప్ గురించి వార్తలు వస్తూ ఉంటాయి. కానీ అమీషా పటేల్ మాత్రం దేనికి ఎక్కువగా స్పందించరు.

#7 నగ్మా

అప్పట్లో దాదాపు అందరు హీరోలతో యాక్ట్ చేసి టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నగ్మా ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. నగ్మా కూడా తన పెళ్లి గురించి ఎక్కువగా రియాక్ట్ అవ్వరు.

#8 ఆశ పారేఖ్

1952 లో తన కెరీర్ ని మొదలు పెట్టిన ఆశ పారేఖ్ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు తో పాటు, అవార్డులను కూడా గెలుచుకున్నారు.

#9 శోభన

2017 లో శోభన పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ 2018 లో ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా మాట్లాడను అని, కానీ తను సింగిల్ గా సంతోషంగా ఉన్నాను అని చెప్పారు.

#10. కౌసల్య

పంచదార చిలక, అల్లుడుగారొచ్చారు సినిమాలతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న కౌసల్య కూడా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో రకుల్ తల్లిగా నటించి సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టారు కౌసల్య.