చిరు ‘ఆచార్య’ కి కొత్త ఇబ్బందులు? రామరాజు కూడా హ్యాండ్ ఇచ్చినట్టేనా ?

చిరు ‘ఆచార్య’ కి కొత్త ఇబ్బందులు? రామరాజు కూడా హ్యాండ్ ఇచ్చినట్టేనా ?

by Anudeep

పొలిటికల్ కారియర్ కి బ్రేక్ ఇచ్చి..మళ్ళీ సినీపరిశ్రమ కి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ..ఖైదీ నే 150 తో బ్లాక్ బస్టర్ సాధించి…సైరా తో సత్తా చాటిన తరువాత మొదలు పెట్టిన ప్రాజెక్ట్ ‘ఆచార్య’ ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు…హిట్టు సినిమాల దర్శకుడు కొరటాల శివ తోడు అవడం తో సినిమా మీద మరింత అంచనాలు పెరిగాయి.

Video Advertisement

మొదుట ఈ సినిమా కోసం మహేష్ నటించబోతున్నాడు అంటావు రూమర్స్ వచ్చాయి..కానీ ఎలాంటి అధికార సమాచారం చిత్ర యూనిట్ నుంచి లేకపోవడం తో ఇవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి.తిరిగి మహేష్ ప్లేస్ ని రామ్ చరణ్ చేయబోతున్నాడు అంటూ మళ్ళీ వార్తలు వచ్చాయి.ఈ విషయాన్నే చిత్ర యూనిట్ కూడా ధ్రువీకరించింది కూడా. ‘ఆచార్య’ లో చరణ్ ఒక నక్సల్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని..ఈ సినిమాకి అదే కీలకం కాబోతుంది అని సినిమా యూనిట్ చెప్పారు.. ఇటీవలే చిరు సైతం తన ఇంటర్వ్యూ లో ఎన్నో విషయాలు చెప్పుక్కుకొచ్చాడు నాది చరణ్  గురు శిష్య రోల్ అంటూ చెప్పేసారు కూడా.

అయితే ఇప్పుడు చరణ్ ఈ సినిమాకి ఎప్పుడు షూటింగ్ లో పాల్గొంటాడు అనేదానికి ఎక్కడ క్లారిటీ లేదు. చరణ్ కి సంబంధించి చాల వర్క్ పూర్తి కావాల్సి ఉంది..ఇది ఇలా ఉండగా RRR కోసం చరణ్ చేయాల్సిన పని ఇంకా మిగిలి ఉండటం తో చరణ్ ఆచార్య లో కనిపించే అవకాశాలు చాల వరకు తగ్గుతున్నాయి.కరోనా కారణంగా షూటింగ్స్ సైతం వాయిదా పడటం తో..మరిన్ని తలనొప్పులు మొదలు అయ్యాయి.చివరిగా ఇప్పుడు ఆచార్య లో చరణ్ ఉంటాడా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


You may also like

Leave a Comment