Ads
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకి గేమ్ ఛేంజర్ అనే టైటిల్ పెట్టారు. నిన్న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ టైటిల్ ప్రకటించారు. అలాగే రామ్ చరణ్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తారు.
Video Advertisement
సాధారణంగా శంకర్ సినిమాలు అంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తారు. కానీ ఈ సారి కొంచెం డిఫరెంట్ గా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాటలు షూట్ కూడా జరిగాయి. సినిమాలో ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్ నటులు ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది.
ఈ సినిమా టైటిల్ పోస్టర్ చూస్తే రాజకీయాలకి సంబంధించి స్టోరీ ఉంటుంది అని అనిపిస్తుంది. అలాగే అంతకు ముందు లీక్ అయిన కొన్ని ఫోటోలు, వీడియోలు చూస్తే రామ్ చరణ్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తారు అని, ఒకటి ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టు ఉంటే, ఒకటి కొన్ని సంవత్సరాల క్రితం జనరేషన్ కి తగ్గట్టు ఉంటుంది అని అర్థం అవుతోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. అంతకు ముందు రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి వినయ విధేయ రామ సినిమాలో నటించారు.
అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక విషయం మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేసి దానికి సంబంధించి ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఆ వీడియోలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక సూపర్ హిట్ పాటకి దగ్గరగా ఉంది అని కామెంట్స్ వస్తున్నాయి. ఈ మ్యూజిక్ కొంత మంది హిందీలో సోనం కపూర్ నటించిన అయిషా సినిమాలోని ఒక పాటకి దగ్గరగా ఉంది అని అంటున్నారు.
watch video :
మరి కొంత మంది అయితే రోబో సినిమాలో మొదటి పాటలో వచ్చే మ్యూజిక్ ఇలాగే ఉంటుంది అని అంటున్నారు. అయితే ఇలా కామెంట్స్ రావడం మొదటి సారి ఏమీ కాదు. అంతకుముందు చాలా పాటలకి ఇలాగే చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక అలా కామెంట్ చేసిన పాటే పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఒక వేళ సినిమాలో ఈ మ్యూజిక్ మెయిన్ మ్యూజిక్ అయితే, ఈ మ్యూజిక్ కూడా అలాగే చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు.
watch video :
End of Article