SKANDA REVIEW : “రామ్ పోతినేని” ఈ సినిమాతో హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

SKANDA REVIEW : “రామ్ పోతినేని” ఈ సినిమాతో హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

ప్రతి సినిమాకి తన పాత్రకి తగ్గట్టుగా మారుతూ, తనని తాను ప్రూవ్ చేసుకుంటున్న హీరో రామ్ పోతినేని. తనదైన మార్క్ కమర్షియల్ సినిమాలతో ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా స్కంద. ఈ సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : స్కంద
  • నటీనటులు : రామ్ పోతినేని, శ్రీలీల, సయీ మంజ్రేకర్.
  • నిర్మాత : శ్రీనివాస చిత్తూరి
  • దర్శకత్వం : బోయపాటి శ్రీను
  • సంగీతం : ఎస్ తమన్
  • విడుదల తేదీ : సెప్టెంబర్ 28, 2023

skanda movie review

స్టోరీ :

ఒక కోర్టు సీన్ తో సినిమా మొదలవుతుంది. ఒక వ్యాపారవేత్త (శ్రీకాంత్) కొంత మంది వ్యక్తుల వల్ల సమస్యలు ఎదుర్కొంటాడు. దీని వల్ల అతని కుటుంబం అంతా కూడా ఇబ్బందుల్లో పడుతుంది. మరొక పక్క రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి మధ్య గొడవలు అవుతూ ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు (శ్రీలీల) కాలేజ్ లో చదువుతూ ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి తమ్ముడు (ప్రిన్స్) ఈ రాజకీయ విషయాలు అన్నీ చూసుకుంటూ ఉంటాడు.

skanda movie review

దగ్గుబాటి రాజా, శ్రీకాంత్ స్నేహితులు అవ్వడంతో, దగ్గుబాటి రాజా కొడుకు అయిన హీరో (రామ్ పోతినేని) శ్రీకాంత్ ని, శ్రీకాంత్ కూతురుని (సయీ మంజ్రేకర్) వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల నుండి కాపాడాలి అనుకుంటాడు. ఆ ఇబ్బందుల నుండి వారిని హీరో ఎలా కాపాడాడు? అసలు వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్న వ్యక్తులు ఎవరు? ప్రభుత్వం ఇందులో ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉంది? చీఫ్ మినిస్టర్ వల్ల వీళ్లు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

skanda movie review

రివ్యూ :

గత కొద్ది సంవత్సరాల నుండి సరైన హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న హీరో రామ్ పోతినేని. సినిమాకి సినిమాకి తనని తాను మార్చుకునే విధానం బాగున్నా కూడా మిగిలిన విషయాల్లో లోపాలు ఉండడం వల్ల ఆ సినిమాలు ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోవట్లేదు. ఇప్పుడు ఈ సినిమా మీద ప్రేక్షకులకి అంచనాలు బాగా ఉన్నాయి. ఇంక సినిమా కథ విషయానికి వస్తే ఒక మాస్ కమర్షియల్ టెంప్లేట్ సినిమాల్లో దాదాపు రెగ్యులర్ గా చూసే కథ.

skanda movie review

బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ తో సినిమా ముందుకి వెళుతుంది. ప్రతి బోయపాటి సినిమాలో ఉన్నట్టుగానే కాస్త లౌడ్ గా ఉండే హీరో, ఇద్దరు హీరోయిన్లు, ఒక పెద్ద కుటుంబం, ఆ కుటుంబంలో కొన్ని పాత్రల్లో మనకి తెలిసిన పెద్ద పెద్ద నటీనటులు, థియేటర్లు దద్దరిలేలా ఉండే తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఈ సినిమా కూడా ఇలాగే ఉంది. టేకింగ్ విషయానికి వస్తే, ఇది కూడా ఒక కమర్షియల్ సినిమాని హ్యాండిల్ చేసినట్టే ఉంది.

skanda movie review

కాకపోతే బోయపాటి సినిమాలో రామ్ పోతినేని కాబట్టి కాస్త కొత్తగా అనిపిస్తుంది. అంతే కాకుండా ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఒక్క ట్విస్ట్ కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఒక పాయింట్ తర్వాత అవి మోతాదుకి మించి ఉన్నాయి అని అర్థం అయిపోతాయి. కొన్ని అయితే మరీ లాజిక్ లేకుండా ఉంటాయి. ఒక టైంలో ప్రేక్షకులు వీటిని ఎంజాయ్ చేసినా కూడా ఇప్పుడు మైండ్ సెట్ మారింది కాబట్టి వీటిలో తప్పులనే ఎక్కువగా వెతుకుతున్నారు.

skanda movie review

సెకండ్ హాఫ్ లో బోయపాటి టెంప్లేట్ సినిమా లాగానే ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సినిమా ఎలా ఉన్నా కూడా ప్రతి సినిమాకి రామ్ పోతినేని తన వైపు నుండి చేస్తున్న కృషి చాలా బాగుంది. ఈ సినిమా కోసం తనని తాను మార్చుకున్న విధానం కూడా అలాగే ఉంది. అంతే కాకుండా డాన్స్ విషయంలో కూడా చాలా మెరుగు అయ్యారు. అంతకుముందు చాలా బాగా చేసేవారు, కానీ ఈ సినిమాకి ఇంకా ఇంప్రూవ్ అయ్యారు.

skanda movie review

శ్రీలీలకి పెద్దగా చెప్పుకోదగ్గ పాత్ర ఏమీ దొరకలేదు. ఒక కమర్షియల్ సినిమాలో ఉండే మామూలు హీరోయిన్ పాత్ర. తన పాత్ర వరకు తను బానే నటించారు. మరొక హీరోయిన్ సయీ మంజ్రేకర్ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించారు. సీనియర్ నటుడు దగ్గుబాటి రాజా, గౌతమి, శ్రీకాంత్, ఇంద్రజ వంటి నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు.

skanda movie review

సినిమాలో పాటలు చెప్పుకోదగ్గ గొప్పగా ఏమీ లేవు. పాటలు విన్నప్పుడే యావరేజ్ అని ప్రేక్షకులు కామెంట్స్ చేశారు. సినిమాలో చూసిన తర్వాత కూడా అలాగే అనిపిస్తాయి. కొన్ని పాటలు మాత్రం చిత్రీకరించిన విధానం బాగుంది. సంతోష్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. కానీ కొన్ని సీన్స్ లో, అందులోనూ ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో మాత్రం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • రామ్ పోతినేని
  • నిర్మాణ విలువలు
  • ఇంటర్వెల్ కి ముందు వచ్చే ట్విస్ట్
  • సినిమాటోగ్రఫీ

ప్లస్ పాయింట్స్ :

  • రొటీన్ కమర్షియల్ టెంప్లేట్
  • లాజిక్ లేని సీన్స్
  • మోతాదుకి మించిన యాక్షన్ సీన్స్
  • తెలిసిపోయే కథనం

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

లాజిక్ పక్కన పెట్టి, అసలు ఆ పదం ఒకటి ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోయి, రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయినా పర్వాలేదు రామ్ పోతినేని కోసం చూద్దాం అనుకునే వారికి, లేదా మాస్ మసాలా సినిమాలు ఎంజాయ్ చేసే వారికి స్కంద సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.

watch trailer : 

ALSO READ : ఒక్కరు కూడా తగ్గట్లేదు ఎందుకు..? ఇంత మొండితనంగా ఉండడానికి కారణం ఏంటి..?


End of Article

You may also like