ఒక్కరు కూడా తగ్గట్లేదు ఎందుకు..? ఇంత మొండితనంగా ఉండడానికి కారణం ఏంటి..?

ఒక్కరు కూడా తగ్గట్లేదు ఎందుకు..? ఇంత మొండితనంగా ఉండడానికి కారణం ఏంటి..?

by kavitha

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో రాధాకృష్ణ(చినబాబు) ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన హనుమాన్ మూవీ కూడా సంక్రాంతి రేసులో ఉంది.

Video Advertisement

అయితే ఇప్పుడు మరిన్ని సినిమాలు కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నటుగా ప్రకటించడం టాలీవుడ్ లో ప్రస్తుతం  హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పై సోషల్ మీడియాలో కూడా చర్చకు దారి తీసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మహేష్ గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించాయి. ఇటీవల  నాగార్జున కూడా తాను నటిస్తున్న నా సామీరంగా మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లుగా చెప్పేశారు. అలా సంక్రాంతి రేస్ లో మూడు సినిమాలు చేరాయి. నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ చిత్రాలు క్రిస్మస్ రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు.
కానీ అనూహ్యంగా హాయ్ నాన్న,సైంధవ్ సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ఈగిల్, విజయ్ దేవరకొండ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తునట్లుగా ప్రకటించారు. దీంతో గుంటూరు కారం లాంటి పెద్ద సినిమా సంక్రాంతి బరిలో ఉండగా, ఇన్ని సినిమాలు ఎందుకు పోటీ పడుతున్నాయి అనేది చర్చకు దారి తీసింది. ఇలా ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇలా చేయడానికి కారణం ప్రభాస్ సలార్ సినిమా అని తెలుస్తోంది.
Salaar-Teaserసలార్‌ రిలీజ్‌ డేట్ సెప్టెంబర్‌ 28 అని సంవత్సరం క్రితమే ప్రకటించింది. దాంతో చాలా సినిమాలు ఆ డేట్ కు దరిదాపుల్లో రాకుండా ప్లాన్‌ చేసుకున్నాయి. తీరా ఆ మూవీ విడుదల పోస్ట్‌ పోన్ కావడంతో షూటింగ్‌ పూర్తిచేసుకున్న చిత్రాలన్ని డిసెంబర్ నెలలో క్రిస్మస్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాయి. అయితే సలార్ డిసెంబర్‌ 22న రిలీజ్ అవుతుందని వార్తలు వస్తుండడంతో ఇప్పటికే క్రిస్మస్‌ కు రిలీజ్ రెడీ అయిన మీడియం బడ్జెట్‌ చిత్రాలు గందరగోళంలో పడ్డాయి. దాంతో సంక్రాంతికి రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

Also Read: ఇండియా నుండి ఆస్కార్ 2024 అవార్డుకి ఎంట్రీగా ఎంపిక అయ్యింది..! ఏం ఉంది ఈ సినిమాలో..?


End of Article

You may also like