ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిల్లో ఒక హీరోయిన్ ఉన్నారు..! ఎవరో కనిపెట్టగలరా..?

ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిల్లో ఒక హీరోయిన్ ఉన్నారు..! ఎవరో కనిపెట్టగలరా..?

by Mohana Priya

Ads

సోషల్ మీడియా తెలియని చాలా విషయాలను తెలియజేస్తుంది. మన ఫేవరెట్ సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలి అని ఆసక్తి అందరిలో ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో మన అభిమాన సెలబ్రిటీలకు సంబంధించిన చాలా విషయాలు ఉంటాయి. వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా ఇందులో ఉంటాయి. అలా సోషల్ మీడియాలో హీరో, హీరోయిన్ల చిన్నప్పుడు ఫోటోలు కూడా ఉంటాయి. అవన్నీ ఎలా సంపాదిస్తారో తెలియదు. ఎవరో ఒకరు ఇలాంటివన్నీ కూడా వెతికి పోస్ట్ చేస్తూ ఉంటారు.

Video Advertisement

this girl is a heroine

ఒక్కొక్కసారి ఇవన్నీ చూసినప్పుడు సెలబ్రిటీలకు కూడా అసలు ఇలాంటి విషయాలు వీళ్ళు ఎలా సంపాదించారు అని ఆశ్చర్యం కలుగుతుంది. పైన ఉన్న ఫోటోలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఇది ఒక స్కూల్ గ్రూప్ ఫోటో. ఇందులో ఒక హీరోయిన్ కూడా ఉన్నారు. ఆమె దాదాపు 20 సంవత్సరాల నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఆమె మరెవరో కాదు. హీరోయిన్ కాజల్ అగర్వాల్. లక్ష్మీ కళ్యాణం తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కాజల్ అగర్వాల్, ఇప్పుడు సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు.

మధ్యలో పెళ్లి, తర్వాత బాబు డెలివరీ తర్వాత కొంత కాలం బ్రేక్ తీసుకున్నారు. ఆ తర్వాత నుండి మళ్ళీ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సత్యభామ సినిమా ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉన్నారు. ఇది ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇలాంటి పాత్రలో కాజల్ అగర్వాల్ ని చూడడం మొదటిసారి. సినిమాలో ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది అని కాజల్ అగర్వాల్ తెలిపారు. నవీన్ చంద్ర ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

సుమన్ చిక్కల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, గూఢచారి, మేజర్ వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన శశి కిరణ్ తిక్క స్క్రీన్ ప్లే అందించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రస్తుతం కాజల్ ఈ సినిమా ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత కాజల్ నటించిన భారతీయుడు 2 సినిమా కూడా విడుదల అవుతుంది.


End of Article

You may also like