Ads
సినిమా ఇండస్ట్రీలో పోటీ అనేది సహజంగానే ఉంటుంది. అది ఆరోగ్యకరంగానే ఉంటుంది. సినిమాలలో పోటీ ఉంటుంది కానీ, బయట మాత్రం అందరూ స్నేహంగా ఉంటారు. సినిమాల్లో పోటీ అంటే గుర్తొచ్చే హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఒకరు. వీళ్ళిద్దరి అభిమానులు సోషల్ మీడియాలో ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. వీళ్లిద్దరి మధ్య పోటీ ఇప్పుడు కాదు. ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నది. మధ్యలో చాలా మంది హీరోలు వీళ్ళకి పోటీ వచ్చినా కూడా మళ్లీ సినిమాల పరంగా, సినిమా ఇండస్ట్రీలో వీళ్లు ఉన్న సమయం పరంగా చూస్తే వీళ్లిద్దరి మధ్య పోటీ ఎక్కువగా నెలకొంటుంది. మిగిలిన హీరోలు అందరూ కూడా ఇప్పటికే పాన్ ఇండియన్ సినిమాలు మొదలు పెట్టేసారు.
Video Advertisement
కానీ వీళ్ళిద్దరూ తెలుగు సినిమాలు చేస్తూ ఉన్నారు. హరి హర వీర మల్లు సినిమాతో పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. అయితే, ప్రస్తుతం వీళ్లిద్దరి మార్కెట్ ఎలా ఉంది అనే చర్చ అందరిలో నెలకొంది. ఇద్దరి సినిమాలు విడుదల అయినప్పుడు సెలబ్రేషన్స్ బాగా ఉంటాయి. అదే రకంగా ఆసక్తి కూడా ఉంటుంది. డిజిటల్ రిలీజ్ రైట్స్ కూడా ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోతాయి. కానీ గత కొంత కాలం నుండి పవన్ కళ్యాణ్ ఎక్కువగా సినిమాల మీద శ్రద్ధ పెట్టట్లేదు. ఎలక్షన్స్ కారణంగా రాజకీయాలకు సంబంధించిన పనులలో బిజీగా ఉంటున్నారు.
దాంతో మార్కెట్ గ్రాఫ్ అంత పెద్దగా పెరగలేదు. మరొక పక్క మహేష్ బాబు యావరేజ్ టాక్ తో కూడా 100 కోట్ల షేర్ సాధిస్తున్నారు. మహేష్ బాబు నటించిన గత కొన్ని సినిమాలకి యావరేజ్ టాక్ వచ్చింది. అయినా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అలాంటి టాక్ తో అంత కలెక్షన్స్ తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. సర్కారు వారి పాటకి సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డే నుండి డిజాస్టర్ టాక్ వచ్చింది. గుంటూరు కారం సినిమాకి కూడా ఇలాగే జరిగింది. కానీ మెల్లగా ఈ సినిమాలు ప్రజల్లోకి వెళ్లాయి. డిజిటల్ రిలీజ్ రైట్స్ కూడా ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయాయి.
ఒక తెలుగు సినిమాకి అంత మొత్తంలో డిజిటల్ రిలీజ్ రైట్స్ తీసుకోవడం అనేది గుంటూరు కారం సినిమాకి జరిగింది. మహేష్ బాబు సినిమాలకి ఓవర్సీస్ లో కూడా మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ కూడా ఎక్కువ మొత్తానికి రైట్స్ అమ్ముడు పోతాయి. పవన్ కళ్యాణ్ మార్కెట్ గ్రాఫ్ పెరగాలి అంటే హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే. అప్పుడే మళ్లీ రిలీజ్ డిమాండ్ ఎలా ఉందో తెలుస్తుంది. దాన్నిబట్టి మార్కెట్ కూడా ఎలా ఉంది అనేది అప్పుడు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ స్థాయికి తగ్గట్టుగా మార్కెట్ బలపడుతుంది.
End of Article