పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. రవితేజ, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు ఇలా చాలా మంది హీరోలకి సూపర్ హిట్స్ ని తీసుకు వచ్చారు పూరీ. ఈ దర్శకుడు డైరెక్షన్ లో ఏ హీరోకైనా ఇమేజ్ వస్తుంది. తర్వాత నిజంగా పెద్ద స్టార్లు కూడా అయిపోతుంటారు. చాలా మంది స్టార్ హీరోలకి అద్భుతమైన హిట్స్ ని ఇచ్చి వాళ్ళ యొక్క ఇమేజ్ ని పూరి జగన్నాధ్ రెట్టింపు చేసారు. అయితే తాజాగా కొన్ని పర్సనల్ విషయాల గురించి మరియు పెళ్లి గురించి మాట్లాడుతూ పూరి జగన్నాథ్ ఆసక్తికరమైన విషయాలను చెప్పారు.

Video Advertisement

అయితే పూరి జగన్నాథ్ తన భార్య లావణ్య ని వివాహం చేసుకునే సమయంలో అతని దగ్గర కొంచెం డబ్బులు కూడా లేవు అని అన్నారు. అప్పుడే పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం చూస్తున్నారట. అయితే పూరీ జగన్నాథ్ లావణ్యని ప్రేమించారు. వీళ్లది ప్రేమ వివాహం అవడంతో ఎవరికీ చెప్పకుండా రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకున్నారు.

మూడు ముళ్ళు వేయడానికి తాళిబొట్టు కావాలి కదా అది కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి పూరి జగన్నాధ్ ది. అప్పుడు యాంకర్ ఝాన్సీ తాళిబొట్టు కొని ఇచ్చారట. పెళ్లి బట్టలు అయితే హేమ కొనిపెట్టారు. అదే విధంగా కొంత మంది ఫ్రెండ్స్ కూల్ డ్రింక్స్ వంటివి కొని సహాయం చేశారట.

ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చిన తర్వాత నెమ్మది నెమ్మదిగా సంపాదించడం మొదలు పెట్టారు పూరి జగన్నాథ్. అయితే సంపాదించినా సరే కొంత మంది స్నేహితులని గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోవాల్సి వచ్చింది. దీంతో చాలా సంపాదన పోగొట్టుకున్నారు. అయితే ఆయన పెళ్లికి సహాయం చేసిన ఝాన్సీ, హేమ మరియు మిగిలిన స్నేహితులని ఎప్పటికీ మర్చిపోలేను అని పూరి జగన్నాధ్ చెప్పారు.