రమేష్ బాబు బాలీవుడ్ హీరోయిన్ జుహీ చావ్లా జంటగా నటించారు అని తెలుసా..? ఏ సినిమాలో అంటే..?

రమేష్ బాబు బాలీవుడ్ హీరోయిన్ జుహీ చావ్లా జంటగా నటించారు అని తెలుసా..? ఏ సినిమాలో అంటే..?

by Anudeep

Ads

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు మృతి చెందిన విషయం విదితమే. 55 సంవత్సరాల వయసులోనే ఆయన మృతి చెంది సూపర్ స్టార్ కృష్ణకు పుత్ర శోకం మిగిల్చారు. చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం దురదృష్టకరం అంటూ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సూపర్ స్టార్ తనయుడిగా రమేష్ బాబు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పలు సినిమాల్లో హీరోగా కూడా నటించారు.

Video Advertisement

 

మహేష్, రమేష్ లు “పోరాటం” సినిమా లో కలిసి నటించారు. ఈ సినిమాలో రమేష్ నటనకి మంచి పేరు వచ్చినా.. అవకాశాలు మాత్రం రాలేదు. తక్కువ సమయంలోనే రమేష్ బాబు నటనకు దూరం అయ్యారు. అయితే నిర్మాతగా మాత్రం కొన్ని సినిమాలకు వ్యవహరించారు.

ramesh 2

ఇది ఇలా ఉంటె, రమేష్ బాబు హీరోగా నటించిన రోజుల్లో బాలీవుడ్ హీరోయిన్ జూహీ చావ్లాతో జంటకట్టారు. ఈ సినిమాకు సూపర్ స్టార్ కృష్ణ దర్సకత్వం వహించారు. 1988లో ఈ సినిమా విడుదల అయ్యింది. “కలియుగ కర్ణుడు” అని ఈ సినిమాకు పేరు పెట్టారు. ఈ సినిమాలో జూహీ చావ్లా హీరోయిన్ గా నటించారు. అయితే.. పేరులో తెలుగు తనం కనిపించాలన్న ఉద్దేశంతో సూపర్ స్టార్ కృష్ణ ఆమె పేరుని “మీనా” గా మార్చారు.

ramesh 1

అయితే, ఆమె ఆ తరువాత నటించిన ‘విక్కీ దాదా’, ‘శాంతి క్రాంతి’ సినిమాల్లో తన అసలు పేరు తోనే నటించింది. కలియుగ కర్ణుడు సినిమాలో కృష్ణ, రమేష్ బాబులు అన్నదమ్ములుగా నటించారు. టైటిల్ రోల్ ని కృష్ణ పోషించారు. న్యాయం కోసం పోరాడే తమ్ముడిగా రమేష్ బాబు కనిపిస్తారు. హీరోయిన్ జూహీ చావ్లా ఈ సినిమాలో కంటే ముందు “ప్రేమలోక” అనే కన్నడ సినిమాలో నటించింది. అది తెలుగులో ” ప్రేమలోకం” గా విడుదల అయ్యి మంచి పేరు తెచ్చుకుంది. ఇందులో జూహీని చూసిన కృష్ణ “కలియుగ కర్ణుడు” సినిమా కోసం తీసుకున్నారు.


End of Article

You may also like