Ads
వ్యాపార దిగ్గజం రామోజీరావు గారు ఇవాళ తుది శ్వాస విడిచారు. రామోజీ రావు గారు తెలుగు చిత్ర పరిశ్రమకి చేసిన సేవ వెలకట్టలేనిది. అసలు రామోజీ ఫిలిం సిటీ అనేది ఒకటి లేకపోతే, తెలుగు ఇండస్ట్రీలో షూటింగ్స్ అనేవి ఇంత సులభంగా అయ్యేవి కావు. ఎన్నో సదుపాయాలని తన వ్యాపారాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చారు రామోజీరావు గారు. రామోజీరావు గారు తెలుగు జాతి గొప్పదనాన్ని అందరికీ చెప్పాలి అని ఎప్పుడు తాపత్రయపడుతూ ఉండేవారు.
Video Advertisement
ఈనాడు పేపర్ లో కూడా ఎక్కువగా తెలుగు పదాలు మాత్రమే వాడుతారు. అలా తెలుగు గురించి అందరికీ చాటి చెప్పాలి అని అనుకునేవారు. 2014 లో రామోజీరావు గారు ఒక లెటర్ రాశారు అందులో విద్యాశాఖమాత్యులు అయిన జగదీశ్ రెడ్డి గారికి ఈ లెటర్ రాశారు. తెలుగు భాషని ప్రోత్సహించడం అనే విషయం మీద రామోజీరావు గారు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ లెటర్ రాశారు. ఇందులో రామోజీరావు గారు ఏం రాశారంటే,
శ్రీ జి.జగదీశ్ రెడ్డి
విద్యాశాఖామాత్యులు
తెలంగాణ ప్రభుత్వం
సెక్రెటేరియట్, హైదరాబాదు
గౌరవ విద్యాశాఖామాత్యులు శ్రీ జగదీశ్ రెడ్డి గారికి, నమస్కారం. అవసరం కోసం ఆంగ్లం నేర్చుకున్నా అమ్మభాషను ఏనాడూ మరువకూడదంటూ మీరు వ్యక్తీకరించిన అభిప్రాయం నన్నీ అభినందన లేఖ రాయడానికి ప్రేరేపించింది. తెలుగు నేలపై అమ్మ భాషకు ఆదరణ కరవై ఇంటా బయటా అన్యభాషా వినియోగానిదే పైచేయి అవుతున్న దురదృష్టకర పరిస్థితుల్లో, మీ వంటి నేతల మాటలు భాషాభిమానులకు ఊరటనిస్తాయనడంలో సందేహం లేదు. ఆంగ్లంతోపాటు సొంతభాషలోనూ విద్యాబోధన జరగాలన్న అంతర్జాతీయ సంస్థల ఉదోషలూ బేఖాతరైపోయిన ఈ దశలో తెలుగు భాష బాగోగుల గురించి పట్టించుకునే బాధ్యత మీవంటి సమర్థ నేతల భుజస్కంధాలపైనే ఉంది. తెలుగు భాషా వికాసం, మాతృభాషా సముద్ధరణ దిశగా మీ యోచన, కార్యాచరణ భావితరాల్లో తెలుగు పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడగలవని నేను నమ్ముతున్నాను.
అభినందనలతో…
మీ
రామోజీరావు
అని రామోజీరావు గారు ఈ ఉత్తరంలో రాశారు. ఇది చూస్తూ ఉంటే రామోజీరావు గారికి తన మాతృభాష పట్ల ఎంత అభిమానం ఉంది అనే విషయం అర్థం అవుతోంది.
End of Article