Ads
ప్రతి ఆదివారం సాయంత్రం ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్ స్వరాభిషేకం. ఈ ప్రోగ్రాంలో ఎంతో మంది గాయకులు వచ్చి వాళ్లు పాడిన పాటలు మాత్రమే కాకుండా ఇతర గాయకులు పాడిన పాటలని కూడా పాడతారు. ఈ ప్రోగ్రాంలో ప్రతి వారం ఒక దర్శకుడు, లేదా సంగీత దర్శకులు, లేదా నిర్మాత, హీరో, హీరోయిన్ గాయకులు, ఇలా ఒక వ్యక్తికి సంబంధించిన పాటలను పాడతారు.
Video Advertisement
స్వరాభిషేకం ప్రోగ్రాంలో మనకి ఎక్కువగా కనిపించే సింగర్స్ హేమచంద్ర, కారుణ్య, రమ్య బెహరా, సత్య యామిని, సాహితి చాగంటి, ఎస్పీ చరణ్, సునీత, చిత్ర, దీపు. అయితే ఈ ప్రోగ్రాంలో ఇటీవల ఒసేయ్ రాములమ్మ సినిమాలోని ఒసేయ్ రాములమ్మ టైటిల్ పాటని పాడారు. ఈ పాటకి వందేమాతరం శ్రీనివాస్ గారు సంగీతాన్ని అందించారు.
ఈ పాటని ఒరిజినల్ గా వందేమాతరం శ్రీనివాస్ గారు, స్వర్ణలత గారు పాడారు. ఒసేయ్ రాములమ్మ సినిమా వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ పాటకి మాత్రం ఇప్పటికి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే, స్వరాభిషేకం ప్రోగ్రాంలో ఈ పాటని కారుణ్య, రమ్య బెహరా పాడారు. వీరిద్దరూ పాడిన ఈ పాటకు సంబంధించిన వీడియోని ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేశారు.
“కారుణ్య, రమ్య బెహరా ఎంతో బాగా పాడారు” అంటూ ఈ వీడియోకి కామెంట్స్ పెడుతున్నారు. అందులోనూ ముఖ్యంగా “రమ్య బెహరా గొంతు అయితే చాలా బాగుంది. ఈ పాటకి చాలా బాగా సూట్ అయ్యింది అని, చివరిలో వచ్చే “పూసేటి పూలన్నీ పోసే తలంబ్రాలమ్మా” అనే లిరిక్స్ చాలా బాగా పాడారు అని, ఈ పాటలో రమ్య బెహరా గొంతు వింటూ ఉంటే ఈ పాట ఒరిజినల్ వర్షన్ పాడిన స్వర్ణలత గారు గుర్తుకొచ్చారు” అని కామెంట్స్ పెడుతున్నారు.
watch video
End of Article