కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి.. కరోనాతో సహజీవనం తప్పదని ప్రభుత్వాలు లాక్ డౌన్లో సడలింపులు ప్రకటించాయి..దీంతో ప్రజలు ఎవరికి వారే అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి..ఈ పరిస్తితుల్లో గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి అనుభంద సంస్థ యునిసెఫ్ హెచ్చిరికలు జారీచేసింది..మే 10వ తేదీన జరిగిన అంతర్జాతీయ మాతృదినోత్సవం సంధర్బంగా ఒక ప్రకటణ విడుదల చేసింది.

Video Advertisement

లాక్ డౌన్ సడలించినంత మాత్రానా కరోనా ప్రభావం తగ్గిందని కాదు.. మరో ఏడాది పాటు కరోనా ప్రభావం ఉంటుందని ముందు నుండి వింటూనే ఉన్నాం.. చిన్నపిల్లలు,వయసు పైబడినవారు, రకరకాల అనారోగ్యాలతో బాధపడేవారే కరోనా మెయిన్ టార్గెట్ అనే విషయం తెలిసిందే..ఈ క్రమంలో గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదే.. తాజాగా యునిసెఫ్ జారీ చేసిన ప్రకటణ ప్రకారం “ రానున్న తొమ్మిది నెలలకాలంలో భారత్ లో సుమారు 2కోట్ల మంది శిశువులు జన్మించనున్నారని,వారకి కరోనా ప్రమాదం పొంచి ఉందని వివరించింది.

గర్భిణులు, నవజాత శిశువులు కోవిడ్ -19భారిన పడే ప్రమాదం ఉంది. నవజాత శిశువుల మరణాలు అధికంగా ఉన్న దేశాల్లో కరోనా ముప్పు ఉందని యునిసెఫ్ హెచ్చిరించింది..ఈ జాబితాలో భారత్ ప్రధమ స్థానంలో ఉందని, తర్వాత చైనా,నైజీరియా,పాకిస్తాన్, ఇండోనేషియా వరుసక్రమంలో ఉన్నాయి. తల్లినుండి బిడ్డకు కరోనా సోకుతుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు..కానీ గర్భిణులు తమకు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి గర్భిణులు రెగ్యులర్ చెకప్స్ కి హాస్పిటల్స్ కి వెళ్లిన దాకలాలు తక్కువ..అత్యవసరం అయితే తప్ప హాస్పిటల్స్ వైపు వెళ్లట్లేదు.ఒకవైపు ఇన్ఫెక్షన్లు సోకుతాయనే భయం, మరోవైపు గర్భదారణ దగ్గర నుండి ప్రసవం, ఆ తర్వాత అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది..వాటన్నింటిని ఎదుర్కోవడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు ఇప్పటినుండే సన్నాహాలు చేసుకోవాలని యునిసెఫ్ విజ్ణప్తి చేసింది..లాక్ డౌన్ లాంటి కార్యక్రమాల వలన ఎక్కువగా సఫర్ అయింది గర్భిణులే అని, ఇకపై అలాంటి సమస్యలు రాకుండా చూస్కోవాల్సిన బాద్యత ఆయా దేశాలపై ఉందని ప్రకటించింది.