జబర్దస్త్ లో అవి చూపిస్తావు…వల్గర్ కాక ఇంకేంటి? రష్మీ కౌంటర్ హైలైట్..! ఇలియానా ఫోటోపై?

జబర్దస్త్ లో అవి చూపిస్తావు…వల్గర్ కాక ఇంకేంటి? రష్మీ కౌంటర్ హైలైట్..! ఇలియానా ఫోటోపై?

by Anudeep

Ads

రశ్మి గౌతమ్ జబర్దస్త్  యాంకర్ గా అందరికి సుపరిచితమే . యువ లాంటి సీరియల్ లో, కొన్ని చిత్రాల్లో సైడ్ కారెక్టర్స్ లో నటించినప్పటికి నటిగా కన్నా యాంకర్ గానే గుర్తింపు పొందింది. గుంటూర్ టాకీస్ సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. ఛాన్స్ వస్తే వెండితెరపై తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది రశ్మి. అంతేకాదు రశ్మికి సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువే . ఎప్పటికప్పుడు సోషల్ ఇష్యూస్ పై ట్వీట్స్ చేస్తూ ఉంటుంది.

Video Advertisement

తాజాగా  కరోనా వైరస్ పై అవేర్నెస్ కలిగించేలా పోస్టులో పెడుతోంది. అందులో భాగంగా ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు చేసిన ట్వీట్ ని రశ్మి షేర్ చేసింది. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా గ్యాస్ , వాటర్ బిల్లులు, రెంట్ లాంటివి తొలగిస్తున్నట్టుగా ట్వీట్ చేశారు ఫ్రాన్స్ అధ్యక్షుడు. దీన్ని షేర్ చేస్తూ మనం కూడా దీనికి సిధ్దంగా ఉండాలి అని రశ్మి ట్వీట్ చేసింది.

కరెంట్ , వాటర్ బిల్లులు కాదు కాని వల్గర్ కామెడి షో జబర్దస్త్ ని బ్యాన్ చేయాలి అని  రశ్మి ట్వీట్ కి ఒక నెటిజన్ కామెంట్ చేశారు . ఇది నెక్స్ట్ లెవల్ ఆఫ్ ఎవేర్నెస్. నీలాంటి వాళ్లని అని ప్రయోజనం లేదు. మీ మెంటాలిటి స్థాయి అది. అంటూ కౌంటర్ కామెంట్ చేసింది రశ్మి.

ఇదే ట్వీట్ కి మరో నెటిజన్ చేసిన బూతు కామెంట్ కి రశ్మి దిమ్మతిరిగి పోయేలా  రిప్లై ఇచ్చింది . ఇంతకీ రశ్మిని ఆగ్రహానికి గురి చేసిన ఆ కామెంట్ ఏంటంటే జబర్దస్త్ వల్గర్ షో కాదు. మీరు ఎక్స్ పోజింగ్ చేయడం కూడా తప్పు కాదా అంటూ అసభ్య పదజాలంతో కామెంట్ చేశాడు.

ఇక్కడే రశ్మి తన తెలివి ఉపయోగించి ఆ కామెంట్ చేసిన వాడి అకౌంట్ ని చెక్ చేసి, ఆ మహానుభావుడు చేసిన ఘనకార్యాన్ని ప్రశ్నించింది. అదేంటంటే మనోడు ఇలియానా బికినిలో ఉన్న ఫొటో శేర్ చేసి, ఇల్లి బేబి హెచ్ డి పిక్చర్ పోస్టు చేయొచ్చు కదా అని వాడి అకౌంట్లో ఉన్న ఒక పోస్టుని తీసుకొచ్చి కౌంటర్  ఇచ్చింది.

ఆ పోస్టుని శేర్ చేసి ఇక్కడ ఏమయ్యయి నీ విలువలు, షాపింగ్ కి వెళ్లాయా అని గట్టిగా ఇచ్చింది. ముఖం చూపించుకోలేక ఎవరిదో ఫారినర్ ఫేస్ పెట్టుకుని ఇండియన్ వాల్యూస్ గురించి నువ్ చెప్తున్నావా అని ప్రశ్నించింది. నా డిపి ఏది ఉంటే (ఫారెనర్ ఫేస్)  నీకు ఇబ్బంది ఏంటి అని అనగానే జబర్దస్త్ కి కరోనా కి సంబంధం ఏంట్రా అని మళ్లీ మాట్లాడకుండా చేసింది.


End of Article

You may also like