ఉమెన్స్ డే రోజు రష్మీ సంచలన పోస్ట్…! హోలీ మీద కూడా కౌంటర్ వేసిందిగా..?

ఉమెన్స్ డే రోజు రష్మీ సంచలన పోస్ట్…! హోలీ మీద కూడా కౌంటర్ వేసిందిగా..?

by Anudeep

Ads

జబర్దస్త్ అంటే రశ్మి, రశ్మి అంటే జబర్దస్త్ అన్నట్టుగా ఒక ప్రోగ్రామ్ ద్వారా యాంకర్ కి గుర్తింపు రావడం చిన్న విషయం కాదు. తెలుగు యాంకర్ గా రశ్మిది బుల్లితెరపై ప్రత్యేక స్థానం. అడపా దడపా తెలుగు సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటుంది . మరోవైపు సోషల్ మీడియాలో కడా యాక్టివ్ గా ఉంటూ సోషల్ ఇష్యూస్ పై తన వాయిస్ వినిపిస్తూ ఉంటుంది.

Video Advertisement

తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ట్విటర్‌ వేదికగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపుతూ మొదటగా “మమ్మల్ని సూపర్‌ ఉమెన్‌ చేయడం ఆపండి” అని ఓ ఫొటోను షేర్‌ చేసింది రష్మీ.ఆ తర్వాత “ఓ మహిళ 8 ఏళ్ల నుంచి న్యాయం కోసం ఎదురుచూస్తున్న దేశంలో.. మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. హ్యాపీ ఉమెన్స్‌ డే” అంటూ  ఘాటుగా స్పందించింది. ఆ ట్వీట్ కి నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీరు పెడుతున్న ఫొటోను జత చేసింది రష్మి. మన న్యాయవ్యవస్థలో ఒక అమ్మాయికి న్యాయం చేయలేని నిస్సహాయ స్థితిని వ్యంగ్యంగా ప్రశ్నించింది రశ్మి.

అంతేకాకుండా రష్మీ చేసిన మరో ట్వీట్ కూడా వైరల్ గా మారింది. హోలీ పండుగ సంధర్బంగా  దయచేసి కుక్కలపై రంగులు వేయకండి. హోలీలో మనపై రంగులు పడితే వాటిని శుభ్రం చేసుకునేందుకు మనకు సబ్బులు ఉన్నాయి. కానీ  మూగజీవాలకి అలాంటివేవి ఉండవంటూ రష్మీ ట్వీట్ చేసింది.

అయితే రష్మీ చేసిన ఈ ట్వీట్ పైన ఓ నెటిజన్ స్పందిస్తూ “పండగలు, పబ్బాలు వచ్చినప్పుడే మీకు ఇలాంటివి గుర్తుకు వస్తుంటాయా ? అని కామెంట్ చేసింది.. దీనికి ప్రతిస్పందనగా రష్మీ  “నాపై ఇలాంటి కామెంట్లు పెట్టే ముందు ఒకసారి నేను గతంలో చేసిన పోస్టుల్ని, నా పేజ్‌ను చెక్ చేయండి” అంటూ కౌంటర్ కామెంట్ చేసింది.

సెలబ్రిటీస్ ఎప్పుడు చెప్పారు , ఏం చెప్పారు అని కాకుండా వాళ్లు చెప్పిన దాంట్లో మంచి ఎంత ఉందని గ్రహించగలిగితే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ . నిజానికి హోలీ రంగులు మనుషులకి కూడా అంత మంచివి కాదు అలాంటప్పుడు మూగజీవులకి మనమే హాని చేయడం ఎంత వరకు కరెక్ట్. హోలీ పండుగ చేసుకోవద్దని మేం చెప్పట్లేదు  మనకు  అందుబాటులో ఉన్న నేచురల్ కలర్స్ తో హోలి సెలబ్రేట్ చేసుకుంటే , ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా  , ఆలోచించండి.


End of Article

You may also like