“నేను సౌందర్య లాగా ఉంటానని నాన్న అన్నారు”… అందుకే ఆమె బయోపిక్ లో అంటూ రష్మిక కామెంట్స్.!

“నేను సౌందర్య లాగా ఉంటానని నాన్న అన్నారు”… అందుకే ఆమె బయోపిక్ లో అంటూ రష్మిక కామెంట్స్.!

by Mohana Priya

Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు రష్మిక మందన్న. ఇటీవల యానిమల్ సినిమాతో పాన్-ఇండియన్ విజయం సాధించారు. ఈ సినిమాలో రష్మిక నటనకి మంచి మార్కులు పడ్డాయి. చాలా సహజంగా నటించారు అంటూ కామెంట్స్ చేశారు.

Video Advertisement

ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా నటించారు. రష్మిక ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే, సక్సెస్ అవుతున్న వారి మీద కామెంట్స్ రావడం సహజమైన విషయమే. అదే విధంగా, రష్మిక మీద కూడా చాలా సార్లు ఎన్నో కామెంట్స్ వస్తూ ఉంటాయి.

అయినా కూడా రష్మిక అవి ఏమీ పెద్దగా పట్టించుకోరు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. అయితే రష్మిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకి బయోపిక్ లో నటిస్తే ఎవరి బయోపిక్ లో నటించాలి అని ఉందో చెప్పారు. రష్మికకి సౌందర్య గారి బయోపిక్ లో నటించాలి అని ఉందట. సినిమాల్లోకి రాకముందు రష్మిక తండ్రి రష్మికని, “సౌందర్యలాగా ఉన్నావు” అని అనేవారట. రష్మికకి సౌందర్య బయోపిక్ లో నటించాలి ఉంది అని చెప్పారు.

soundarya last wish before demise

రష్మికకి సౌందర్య సినిమాలు అంటే చాలా ఇష్టం అని, అందుకే తన బయోపిక్ లో నటించాలి అని ఉంది అని చెప్పారు. ఈ విషయం మీద కూడా కామెంట్స్ చేసిన వారు చాలా మంది ఉన్నారు. అయినా సరే రష్మిక పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ నిజంగా రష్మిక సౌందర్య గారి బయోపిక్ లో నటిస్తే, తన పాత్రకి తాను తప్పకుండా న్యాయం చేయగలుగుతారు. ఇప్పటి వరకు రష్మిక నటించిన ప్రతి సినిమాలో తనని తాను నిరూపించుకుంటూ వచ్చారు.

ఒక పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరొక పక్క నటనకి ఆస్కారం ఉన్న పాత్రలు కూడా చేస్తున్నారు. ఇటీవల యానిమల్ సినిమాలో అలాంటి పాత్ర చేశారు. రష్మిక లుక్ చాలా సాధారణంగా ఉంటుంది. కానీ గీతాంజలి పాత్రలో రష్మిక చాలా బాగా నటించారు. ఇప్పుడు రష్మిక తెలుగులో పుష్ప 2 సినిమా చేస్తున్నారు. దీంతో పాటు కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా చేస్తున్నారు.

ALSO READ : సలార్ సినిమాని ఇలా కూడా తీయొచ్చా..? ఈ సీన్ చూస్తే ప్రశాంత్ నీల్ కూడా షాక్ అవుతారు ఏమో..!

 


End of Article

You may also like