Ads
ఛలో వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న…టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన కొద్దీ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది..విజయ్ దేవరకొండ తో చేసిన ‘గీత గోవిందం’ తో గోల్డెన్ లెగ్ గా ముద్ర వేసుకొని ..డియర్ కామ్రేడ్ సినిమాలో తన పెరఫామెన్స్ కి మంచి మార్కులే కొట్టేసింది అమ్మడు..ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరూ’నితిన్ తో భీష్మ తో బ్యాక్ తో బ్యాక్ హిట్స్ తో ఇక తిరుగు లేకుండా పోయింది..
Video Advertisement
నెక్స్ట్ సినిమా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమాలో కూడా నటించే ఛాన్స్ కొట్టేసింది..ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని వాయిదా పడటంతో సెలెబ్రిటీలు అందరూ ఇళ్లకే పరిమితం అయిన సంగతి తెలిసిందే.సోషల్ మీడియా ద్వారా తరచూ అభిమానులతో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తూనే ఉంటారు మన స్టార్స్..ఇటీవలే ఫాన్స్ తో చిట్ చాట్ చేసిన రష్మిక ..అభిమానులని ఒక ప్రశ్న అడిగింది అదేంటంటే..తన పేరు ని మార్చుకోవాలని అనుకుంటే..మీరు ఎంతు వంటి పేర్లని సూచిస్తారు అంటూ ప్రశ్నని సంధించింది..దీనికి బదులుగా కామెంట్ చేస్తూ…శాన్వి,పింకీ,తలా మోని,కొందరైతే రష్మిక దేవరకొండ గా మార్చుకోమని సూచించారు.ఇంకొందరు మాత్రం వద్దు మేడం మీ పేరు బాగుంది మార్చివద్దు అంటూ సూచించారు.
End of Article