Ads
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మండన్న ఎంత త్వరగా పాపులర్ అయ్యారో తెలిసిందే. ప్రస్తుతం నేషనల్ క్రష్ గా పిలవబడుతున్న ఆమె పుష్ప సినిమా తో బిజీ గా ఉంది. అది కాకుండా ఆమె చేతిలో వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇంత బిజీ గా ఉన్న కూడా ఆమె ఓ అండర్ వేర్ యాడ్ లో నటించడం తో విమర్శల పాలైంది.
Video Advertisement
ఇటీవల ఆమె నటించిన యాడ్ ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ యాడ్ లో ఆమె ఓ ఫిట్ నెస్ ట్రైనర్ గా కనిపిస్తున్నారు. ఈ యాడ్ మగవారి లో దుస్తులకు సంబంధించినది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ కూడా ఈ యాడ్ లో నటించారు. ఆయన వేసుకుని అండర్ వేర్ ను చూసి ఫిట్ నెస్ ట్రైనర్ గా నటించిన మండన్న మనసు పారేసుకున్నారు.
దీనితో.. ఫాన్స్ షాక్ అయ్యారు. ఇదేమి యాడ్.. అందులోను డబ్బుల కోసం ఇలాంటి యాడ్ లో నటించడం ఏంటి రష్మిక అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. లోదుస్తులు, సెంట్, డియోడరెంట్ వంటి యాడ్ లలో అబ్బాయిలను చూసి అమ్మాయిలు మనసు పారేసుకుంటూ ఉంటారు. అండర్ వేర్ యాడ్ లో మరీ ఇలా నటించాలా? అంటూ నెటిజన్స్ రష్మిక పై గట్టిగానే ట్రోల్స్ వేస్తున్నారు.
Watch Video:
https://youtu.be/fEptTs777Ys
End of Article