Ads
రష్మిక మందన్న.. చాలా తక్కువ కాలం లోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ని ఓ ఊపు ఊపేసింది. చలో సినిమా తో పరిచయం అయినా రష్మిక.. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. “గీత గోవిందం” సినిమా తో తెలుగు వారి హృదయాలకు మరింత దగ్గరైన రష్మిక “సరిలేరు నీకెవ్వరూ” సినిమా తో బ్లాక్ బస్టర్ ని కూడా సొంతం చేసుకుంది.
Video Advertisement
ఆమె నటించిన సినిమాలన్నీ చెప్పుకోదగ్గ విజయాలను సాధించాయి. తాజాగా.. ఈ బ్యూటీ బాలీవుడ్ కి కూడా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తోందట. అవకాశాలు వస్తే.. హిందీ సినిమాలలో కూడా తన సత్తా చాటడానికి ప్రయత్నిస్తోందట.. ఇప్పటికే మిషన్ మజ్ను లో నటిస్తున్న రష్మిక “గుడ్ బై” అనే మరో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేసిందట. బాలీవుడ్ లో గట్టి ఎంట్రీ నే ఇవ్వడానికి రష్మిక రెడీ అయింది. ఇందుకోసం ప్రత్యేకం గా హిందీ ట్యూటర్ ని కూడా పెట్టేసుకుందట. హిందీ నేర్చుకుంటూ.. ఇంట్లో కూడా హిందీ నే మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తోందట. ఆల్ ది బెస్ట్ రష్మిక..
End of Article