Ads
ప్రేమ కోసం యుద్ధాలు జరగడం లేదా యుద్ధాలవల్ల ప్రేమికులు విడిపోవడం లాంటివి మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో ఒక ప్రముఖ వ్యక్తి కి ఇలాంటి సంఘటన ఎదురైంది. ఆ వ్యక్తి ఎవరో కాదు వ్యాపార దిగ్గజం రతన్ టాటా. రతన్ టాటా పెళ్లి చేసుకో లేదు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ దాని వెనుక ఉన్న కథ ఎవరికీ తెలీదు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాలు తన ప్రేమ కథ గురించి చెప్పుకొచ్చారు రతన్ టాటా.
Video Advertisement
టాటా తల్లిదండ్రులు ఆయనకు పదేళ్ల వయస్సు ఉన్నప్పుడే వెళ్ళిపోయారు. తర్వాత ఆయన వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో టాటా, తన సోదరుడితో కలిసి వేసవి సెలవలు గడపడానికి అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ విలువల గురించి, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలాంటి విషయాలు మాట్లాడాలి, ఎలాంటి విషయాలు మాట్లాడకూడదు వంటి విషయాలు చెప్పారని, వాళ్ళ అమ్మమ్మ పైన ఉన్న గౌరవం అప్పుడు మరింత పెరిగింది అని రతన్ టాటా అన్నారు.
రతన్ టాటా కి వాళ్ల నాన్నకి అస్సలు పడేది కాదట. టాటా లండన్ కి వెళ్లి చదవాలనుకుంటే, వాళ్ళ నాన్న బ్రిటన్ కి వెళ్లి చదవాలి అని అనేవారు. టాటా ఆర్కిటెక్ట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ నాన్న ఇంజనీర్ అవ్వాలి అని చెప్పాడట. చిన్నతనంలో కూడా టాటా కి వయోలిన్ నేర్చుకోవడం ఇష్టమట కానీ వాళ్ల నాన్న మాత్రం పియానో నేర్చుకోమని అనేవారు. ఇలా అన్ని విషయాల్లో ఏదో ఒక రకంగా టాటా కి వాళ్ళ నాన్నకి చిన్న చిన్న గొడవలు వచ్చేవి.
రతన్ టాటా తన అమ్మమ్మ సహకారంతో అమెరికాలోనే ఆర్కిటెక్ట్ విద్యను అభ్యసించారు. ఈ విషయంలో తన తండ్రికి కొంచెం కోపం వచ్చింది. అయినా సరే రతన్ టాటా తన విద్యను పూర్తి చేసే లాస్ ఏంజిల్స్లో ఉద్యోగంలో చేరారు. అక్కడ రెండేళ్ల పాటు ఉద్యోగం చేశారు. టాటా కి ఉద్యోగం నచ్చడంతో ఎంతో కష్టపడి పని చేశారు. సొంతంగా కార్ కూడా కొనుక్కున్నారు.
అదే సమయంలో రతన్ టాటా ఒక అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయి కూడా తనను ఇష్ట పడటం తో పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ టాటా వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో భారతదేశం కి రావాల్సి వచ్చింది. 1962లో ఇండియా-చైనా యుద్ధం కారణంగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు తనని టాటా కోసం భారతదేశం పంపడానికి నిరాకరించారు. దాంతో వారి ప్రేమకథ అక్కడితో ముగిసిపోయింది. ఇలా తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు రతన్ టాటా.
Also Read: రతన్ టాటా నిజమైన కోహినూర్ వజ్రం..! ఆయన గురించి చాలా మందికి తెలియని విషయాలివే.!
End of Article