భారత ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా గురించి తెలియని వారుండరు. ఆయన ఓ ఏడాది లో సంపాదించే ఆస్తిని లెక్కకడితే అపర కుబేరుడు అంబానీని కూడా దాటేయగలరు. కానీ, ఏ అపర కుబేర జాబితాలోనూ రతన్ టాటా పేరు ఉండదు. ఎందుకో తెలుసా..? ఆయన తానూ సంపాదిచిన దానిలో అరవై శాతం మొత్తాన్ని దేశానికే దానం చేసేయాలని నిశ్చయించుకున్నారు. గత కొన్ని సంవత్సరాలనుంచి ఆయన ఈ పద్ధతినే అవలంబిస్తున్నారు. కరోనా వంటి సంక్షోభం లో రతన్ టాటా పీఎం కెర్స్ కు పదిహేనొందల కోట్ల ను విరాళం గా ఇచ్చారు.

ratan taata

అంతటి ఆస్తిపరుడు అయినా కూడా, నేటికీ ఆయన తన పనులను తానె చేసుకుంటారు. తన కారు కూడా తానె డ్రైవ్ చేస్తారు. ఎవరిపైనా ఆధారపడరు. ఇటీవల ఓ మాజీ ఉద్యోగి కోసం ఆయన చేసిన పని తెలిస్తే.. ఆయనకు ఇంత ఔన్నత్యం ఉందా అని ఆశ్చర్యపోతారు. రతన్ టాటా వద్ద పని చేసిన ఓ మాజీ ఉద్యోగి అనారోగ్యం తో బాధపడుతున్నారు. ఆ ఉద్యోగి ని పరామర్శించడం కోసం రతన్ టాటా ముంబై నుంచి పూణే వరకు వెళ్లారు. అది కూడా ఆయన ఒక్కరే, తన కార్ లో సొంతం గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. దాదాపు 150 కిలోమీటర్ల దూరం ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. ఆ ఉద్యోగి రెండు సంవత్సరాల క్రితం టాటా వద్ద పని చేసారు.

ratan tata

కరోనా కాలం కావడం తో ఆయన అపార్ట్మెంట్ కింద ఉండే మాట్లాడి వచ్చేసారు. ఆయన వెంట ఎలాంటి బౌన్సర్లు లేరు.. మీడియా కూడా లేదు. ఆ సందర్భం గా ఆ ఉద్యోగి భార్య తీసిన ఒకే ఒక్క పిక్ ఆయన ఔన్నత్యానికి నిదర్శనం. ఓ మాజీ ఉద్యోగి పట్ల ఎంత ప్రేమను కనబరిచారో తెలుస్తూనే ఉంది. ఇలాంటి వ్యక్తుల వల్లే ఈ భూమి పై ఇంకా వర్షాలు పడుతున్నాయి అనిపిస్తుంది. మంచితనం కోసం మనం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం. మన చుట్టూనే ఉండే వ్యక్తుల్ని గమనించుకొం. నేటి యువత కు రతన్ టాటా ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన సంపదంతా దేశానికే ధారపోసి దేశ భక్తిని చాటుకున్నారు.