ఈ కామర్స్ రంగంలోకి అడుగు పెట్టబోతున్న టాటా..

ఈ కామర్స్ రంగంలోకి అడుగు పెట్టబోతున్న టాటా..

by Anudeep

Ads

ఇప్పటికే భారతదేశంలో ఎన్నో రకాల ఈ కామర్స్ సంస్థలు ఉన్నాయి. వాటిలో అమెజాన్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అటువంటి సంస్థకు పోటీ ఇచ్చే విధంగా భారతీయ సంస్థ అయిన టాటా గ్రూప్స్ ఇప్పుడు ఈ కామర్స్ రంగం వైపుగా అడుగులు వేస్తోంది. కరోనా నేపథ్యంలో ఈ మధ్య వినియోగదారుల్లో పెరిగినా ఈ కామర్స్ వాడకం, ఈ కామర్స్ సంస్థలో వచ్చే గణనీయమైన వృద్ధిరేటుని దృష్టిలో పెట్టుకొని టాటా సంస్థ ఈ విధమైన ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇప్పటికే బిగ్ బాస్కెట్ సంస్థాలో 90 వేల 500 కోట్లు వెచ్చించి 64% వాటాను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ షేర్ల కొనుగోలు పై ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం కొసమెరుపు. ఇప్పటికే టాటా వారు ఎన్నో సర్వీసులను అందిస్తున్నప్పటికి కూరగాయల నుండి ఎలక్ట్రికల్ వస్తువుల వరకూ అన్ని రకాల వస్తువులను ఓకే అప్ లో ఆన్లైన్లో అందించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం సూపర్ అనే యాప్ ను తయారు చేస్తున్నట్లు సమాచారం.

Video Advertisement

దీనిలో ఉన్న లోపాలను, సవాళ్ళను తెలుసుకునే విధంగా ముందుగా పరీక్షించడం కోసం దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా టాటా సంస్థలో పని చేస్తున్నటువంటి ఏడు లక్షల ఉద్యోగులను ఈ సూపర్ యాప్ ను డౌన్లోడ్ చేసి ఉపయోగించాలని టాటా సంస్థ వారు కోరడం జరిగింది. దీని ద్వారా యాప్ లోని లోపాలను తెలుసుకొని మరింత మెరుగైన సేవలను అందించడానికి వీలవుతుందని వారు భావిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే అనేక రంగాలకు చెందిన స్టార్టప్ కంపెనీల్లో టాటా వారు పెట్టుబడులను పెడుతున్నారు దీనిలో భాగంగానే ఫార్మా లో దూసుకుపోతున్న వన్ యమ్ జి సంస్థలో కూడా భారీగా పెట్టుబడులను పెట్టారు. ఇప్పటికే భారతీయ సంస్థ అయిన రిలయన్స్ సంస్థ జియో మార్ట్ పనులలో బిజీగా ఉండగా, ఇప్పుడు వస్తున్న టాటా సంస్థతో ఇకపై ఈ కామర్స్ రంగంలో గట్టి పోటీ ఉండబోతుందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు


End of Article

You may also like