Ads
కలయో నిజమో … కరోనా కాలపు మాయో అనుకుంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లా వాసులు.. కడుపున నలుసు పడక నానాకష్టాలు పడుతున్న దంపతులు కొందరైతే..కడుపున పడ్డ నలుసు తల్లి గర్భం నుండి మాయవవడం అనే వింత గురించి నివ్వెరపోతున్నారు..అవునండి మీరు విన్నది నిజమే గర్భంలోని శిశువు గర్భంలోనే మాయం అయింది..విషయం తెలియాలంటే చదవాల్సిందే..
Video Advertisement
జోగుళాంబ గద్వాల జిల్లా మనోపాడ్ మండలం పెద్ద పోతులపాడు గ్రామానికి చెందిన ఇరవై ఐదేళ్ల మంజులకు ఆరు సంవత్సరాల క్రితం చిన్న పోతులపాడుకి చెందిన వెంకటేష్ తో వివాహం అయ్యింది. ఆరేళ్లుగా మంజుల గర్బం దాల్చని మంజులకు , గత ఏడాది గర్భం నిలబడడంతో పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కన్నది..పెళ్లైన ఇన్నేళ్లకి కడుపులో నలుసు పడడంతో కుటుంబ సభ్యులు కూడా సంతోషించారు. అప్పటి నుండి పుట్టింట్లోనే ఉంటుంది మంజుల.ప్రతి నెల ఆశా వర్కర్ల సహాయముతో మానోపాడ్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(PHC)లో చూపించుకునేదని చెప్తున్నారు. శనివారం నొప్పులు వచ్చాయని హుటాహుటిన మనోపాడ్ PHCకి తీసుకుని వెళ్లారు..హాస్పిటల్ కి చేరుకోగానే “నాకు దేవుడు ఆవహించాడు, నన్ను హాస్పిటల్లోకి తీసుకెళ్లొద్దు అంటూ పూనకం వచ్చిన దానిలా అరవడం మొదలుపెట్టింది. మంజుల పరిస్థితి చూసిన డాక్టర్లకు ఏం చేయాలో తోచలేదు..కుటుంబ సభ్యులు ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో ఉదయం తీసుకొస్తామని ఇంటికి తీసుకుని వెళ్లిపోయారు.
ఇక్కడి వరకు బాగానే ఉంది, అసలు కథ ఇప్పుడు మొదలైంది ఇంటికి వెళ్లాక ప్రతి రోజులానే , ఆ రాత్రి నిద్రపోయింది. కాని ఉదయం లేచి చూసేసరికి మంజుల కడుపు ఖాళీగా ఉంది. ఈ విషయం ఆ నోటా,ఈ నోటా జిల్లా మొత్తం పాకిపోయింది. చుట్టుపక్కల వాళ్లు గుమిగూడారు..రాత్రికి రాత్రి కడుపులో పాప ఎక్కడ పోయిందంటూ నోరెళ్లబెట్టారు.అసలు రాత్రికి రాత్రి బిడ్డ ఎలా మాయమయిందో కుటుంబ సభ్యులకు కూడా అర్దం కాక, అదే విషయం మంజులను అడిగారు. “తెల్లవారు జామున మౌలాలి స్వామి నా బిడ్డను తీసుకెళ్లాడని సమాధానం చెప్పింది”.అసలు ఆమె నిండు గర్భం ఎక్కడికి పోయింది? ఆమె కడుపులో ఉన్న బిడ్డ ఏమైంది?? ఏం అర్దం కాక మళ్లీ వెంటనే మనోపాడ్ హాస్పిటల్ కి వెళ్లారు.
మంజుల గర్భం దాల్చిన మాట వాస్తవమేనని, నిన్నటి వరకు ఆమెకి గర్భంలో శిశువు ఉన్న మాట కూడా నిజమే అని ఆమెని ప్రతి నెల చికిత్స నిమిత్తం హాస్పిటల్ తీసుకెళ్తున్న ఆశావర్కర్ చెప్పసాగింది. అసలు ముందురోజు అర్దరాత్రి ఆమె హాస్పిటల్ కి వెళ్లింది లేనిది తనకు తెలియదని చెప్పుకొచ్చింది. మరోవైపు ఆమెకి ఏడు నెలల కడుపుతో ఉన్నప్పుడు పరీక్షలు నేనే చేశాను, ఇప్పుడు డెలివరి అయినట్లు, అబార్షన్ అయినట్టు ఎలాంటి ఆధారాలు కనపడడం లేదు, స్కానింగ్ చేస్తే తప్ప ఏ విషయం చెప్పలేం అని స్థానిక వైధ్యాధికారి చెప్తున్నారు..
ఇదిలా ఉంటే మంజులతో ముందు రోజు అర్దరాత్రి పిహెచ్సి కి వెళ్లామంటున్న ఆశావర్కర్లు, మంజుల కుటుంబ సభ్యులు అందరూ ఆమె నిన్నటి వరకు కడుపుతో ఉందనే అంటున్నారు.. కడుపు ఎలా ఖాళీ అయిందో మాకు అర్దం కావడంలేదు అంటున్నారు..అబద్దాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదంటూ చాలా గట్టిగా చెప్తున్నారు..అయితే ఆమెకి రక్తస్రావం అయి ఉండవచ్చు,అది దాచిపెట్టడానికి ఆమె ఇలా చేస్తోందేమో అంటూ సందేహాాలు వినపడుతున్నాయి.. పూనకం రావడం, దేవుడు తీస్కెళ్లాడనడం ఇవన్ని చూస్తుంటే ఆమెకి సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరం అని కూడా అనిపిస్తుంది..
మన సమాజంలో ఆడదానికి అమ్మ అవ్వడమే పెద్ద వరం అని, పిల్లలు కలగని స్త్రీని గొడ్రాలుగా జమ కట్టి ఎంతటి గౌరవం ఇస్తారో మనకు తెలిసిందే.. పెళ్లయిన ఆరేళ్లకు కలిగిన గర్భం కూడా నిలబడలేదేమో? సమాజంలో చుట్టుపక్కల వారి మాటలు, అత్తింటి వేధింపుల భయంతో మంజుల ఇలా చేసిందేమో.. ఏదేమైనా కడుపుతో ఉన్నామే దేవుడి లీల అంటుంది.. చుట్టుపక్కల వాళ్లు నిన్నటి వరకు కడుపు ఉందంటున్నారు.. దేవుడి లీలో, మనుషుల మాయో తేలాల్సి ఉంది.. Stay tuned..
End of Article