రవితేజ “ధమాకా” మూవీ సెన్సార్ టాక్..! సినిమా గురించి ఏమన్నారంటే..?

రవితేజ “ధమాకా” మూవీ సెన్సార్ టాక్..! సినిమా గురించి ఏమన్నారంటే..?

by Anudeep

Ads

త్రినాథరావు దర్శకత్వం లో మాస్ మహారాజ రవి తేజ నటిస్తున్న సినిమా ధమాకా. ఈ చిత్రం డిసెంబర్ 23 న థియటర్లలో విడుదల కానుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పెఒప్లెస్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సినిమా ధమాకా. డబుల్ ఇంపాక్ట్ అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం లో రవి తేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.

Video Advertisement

తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు మూవీ కి U/A రేటింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సెన్సార్ సభ్యులు యూనిట్ ని మెచ్చుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. డిసెంబర్ 15 న ట్రైలర్ విడుదల చేయనున్నారు మేకర్స్.

ravi teja dhamaka movie censor talk..

ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన దండకాడియాల్ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాతో మాస్ రాజా సూపర్ హిట్ అందుకోవడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.

ravi teja dhamaka movie censor talk..

అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ లా వస్తున్న ఈ చిత్రం చిరంజీవి నటించిన రౌడీ అల్లుడికి మరో వెర్షన్ లా ఉంటుంది అంటోంది చిత్ర యూనిట్. రవి తేజ చేసిన రెండు పాత్రలు వినోదాన్ని పంచుతూ, సినిమా ఆధ్యంతం సరదాగా సాగిపోతుందని చెబుతున్నారు.

ravi teja dhamaka movie censor talk..

ఈ సినిమాకి నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగినట్టు సమాచారం. దాదాపు ముప్ఫైకోట్ల వరకు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. హిందీ డబ్బింగ్ రైట్స్ 10 కోట్లు, సాటిలైట్, డిజిటల్ రైట్స్ 20 కోట్లు పలికి నాట్లు తెలుస్తోంది. క్రాక్ తర్వాత రవి తేజ నటించిన రెండు చిత్రాలు ప్లాప్ అయినా.. రవితేజ క్రేజ్ తగ్గలేదని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం తర్వాత రవి తేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని చేయనున్నారు.


End of Article

You may also like