Ads
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. అనుపమ పరమేశ్వరన్ మరియు కావ్య థాఫర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
- చిత్రం : ఈగల్
- నటీనటులు : రవితేజ,అనుపమ పరమేశ్వరన్,కావ్య థాఫర్, అవసరాల శ్రీనివాస్, మధుబాల, నవదీప్,అజయ్ ఘోష్, తదితరులు..
- నిర్మాత : టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
- దర్శకత్వం : కార్తీక్ ఘట్టమనేని
- సంగీతం : దవ్‌జాంద్
- విడుదల తేదీ : ఫిబ్రవరి 9, 2024
స్టోరీ :
దట్టమైన తలకోన అడవిలో, సహదేవ వర్మ(రవితేజ ) ఒక పత్తి మిల్లును నడుపుతుంటాడు. అయితే అతని వెనుక ఏదో రహస్యం ఉందని అంతా అనుకుంటూ ఉంటారు. దాంతో ఒక జర్నలిస్ట్ వర్మ రహస్య గతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో అతను ఒక హంతకుడు అని, గవర్నమెంట్ సీక్రెట్ స్కీమ్ గురించి తెలుస్తుంది.
పదేళ్ళ నుండి అజ్ఞాతంలో ఉన్న అతని కోసం నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలు వెతుకుతుంటాయి. అవే కాకుండా ఇతర వర్గాలు కూడా వర్మను ఎందుకు వెతుకుతున్నారు? అతని రహస్య గతం ఏమిటి? వర్మ గురించి తెలిసిన తరువాత ఏమైంది? అనేది మిగిలిన కథ.
రివ్యూ :
డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈగల్ మూవీ టీజర్, ట్రైలర్ లతో సినిమా పై ఓ రేంజ్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. సాలిడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ స్టైలీష్‌గా ఉంది. ఎలివేషన్స్, డైలాగ్స్, విజువల్స్ బాగున్నాయి. ప్రధమార్ధం యావరేజ్ గా ఉంది. కథ మిడ్‌పాయింట్‌కి చేరుకున్నప్పుడు, యాక్షన్ సీక్వెన్స్ తో ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ తరువాత, యాక్షన్-ప్యాక్డ్ సీక్వెన్స్ తో ఊపందుకుంది.
పోలాండ్‌లో సహదేవ వర్మ సీక్వెన్స్ ఫ్లాష్‌బ్యాక్‌కు దారితీసే హై యాక్షన్ సీన్స్ తో కథనం కొనసాగుతుంది. దర్శకుడు చాప్టర్లు, చాప్టర్లుగా స్టోరీ చెప్పే విధానం బాగుంది. ప్రజెంటేషన్ కొత్తగా ఉంది. స్టైలీష్ బీజీఏం అదిరిపోయింది కొన్ని సన్నివేశాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో ఉన్నాయి.
సహదేవ పాత్రలో మాస్ మహారాజా రవితేజ అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. లీడ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో అనుపమ తగినంత స్క్రీన్ ప్రెజెన్స్ అందుకుంది. కావ్య థాపర్ నిర్బంధ పాత్రలో తగినంతగా నటించింది. నవదీప్ సినిమాలో కీలక పాత్రలో చక్కగా నటించాడు. మిగిలిన నటీనటులు పాత్రల మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్ :
- రవితేజ,
- ఎలివేషన్స్,
- హై స్టాండెడ్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్,
- సినిమాటోగ్రఫీ,
- బీజీఎమ్,
మైనస్ పాయింట్స్:
- ఫస్ట్ హాఫ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.
రేటింగ్ :
2.75/5
ట్యాగ్ లైన్ :
“ఈగిల్” ఒక సాలిడ్ యాక్షన్ మూవీ.అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు తో తెరకెక్కిన ఈ మూవీ, ఫస్ట్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేకున్నా, టెక్నికల్ గా ఆకుట్టుకునే ఈ మూవీ రవితేజ ఫ్యాన్స్ కి ఫీస్ట్, ఆడియెన్స్ ఎంజాయ్ చేయవచ్చు.
watch trailer :
End of Article