మాస్ మహారాజా ‘రవి తేజ’ కి పోలీసు డ్రెస్ వేస్తే ఎలా ఉంటుందో ‘విక్రమార్కుడు’ సినిమా లో చూసాం ఆ సినిమా ఎంతటి హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.పంచ్ డైలాగ్స్ తో ఒక రేంజ్ లో ప్రేక్షకుల చేతిలో విజిల్స్ వేయించారు రవి తేజ ..మాస్ మహారాజ్ గా గుర్తింపు తెచ్చుకున్న రవి తేజ గారికి ఒక సరియైన మాస్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఫాన్స్ .’క్రాక్’ సినిమా లో పోలీస్ పాత్ర లో కనిపించబోతున్నారు రవి తేజ గారు. ఈ సినిమా కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు.రవి తేజ గారి సరసన శృతి హాసన్ నటించింది.గతం లో ఎన్నో రవి తేజ హిట్ సినిమాలకి సంగీతం అందించిన థమన్ ఈ సినిమా కి సంగీతం అందించారు.సినిమాలోని డైలాగ్స్ సాయి మాధవ్ బుర్ర గారు అందించారు.సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది.

Video Advertisement