భారీ అంచనాలనడుమ విడుదలైన “మిస్టర్ బచ్చన్” తో రవితేజ హిట్ కొట్టగలిగారా? స్టోరీ, రివ్యూ & రేటింగ్!

భారీ అంచనాలనడుమ విడుదలైన “మిస్టర్ బచ్చన్” తో రవితేజ హిట్ కొట్టగలిగారా? స్టోరీ, రివ్యూ & రేటింగ్!

by Harika

Ads

మాస్ మహారాజుగా తనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న రవితేజ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఈ రోజు విడుదలైన చిత్రం “మిస్టర్ బచ్చన్”. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో షాక్, మిరపకాయ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ చిత్రంకి మరొక హైలైట్ హీరోయిన్ “భాగ్యశ్రీ భోర్సే”. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూ చూసేద్దాం.

Video Advertisement

  • చిత్రం : మిస్టర్ బచ్చన్
  • నటీనటులు : రవితేజ, భాగ్యశ్రీ భోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర, తనికెళ్ల భరణి, అన్నపూర్ణమ్మ, ప్రభాస్ శ్రీను తదితరులు
  • నిర్మాత : టీజీ విశ్వప్రసాద్
  • దర్శకత్వం : హరీష్ శంకర్
  • సంగీతం : మిక్కీ జె మేయర్
  • విడుదల తేదీ : 15-08-2024

స్టోరీ :

మిస్టర్ బచ్చన్ అలియాస్ ఆనంద్ (రవితేజ) నిజాయితీగా పనిచేసే ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఒకసారి అవినీతి పరుడైన ఒక పవర్ ఫుల్ పొగాకు వ్యాపారిపై రైడ్ చేసి పెద్దమొత్తంలో నల్లడబ్బు పట్టుకుంటాడు. కానీ పై ఆఫీసర్స్ అతన్ని సస్పెండ్ చేస్తారు. దీంతో సొంత ఊరు కోటిపల్లికి వెళ్లి ఆర్కెస్ట్రా ట్రూప్ పెట్టుకుంటాడు. ఆ ఊరిలోనే మార్వాడి కులానికి చెందిన జిక్కి (భాగ్యశ్రీ బోర్సె)ను చూసి మొదటిచూపులోనే ప్రేమలో పడిపోతాడు.మొదట్లో అతనికి జిక్కి నో చెప్పినా…తర్వాత ఒప్పుకుంటుంది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్న టైం లో బచ్చన్ కి తిరిగి ఉద్యోగంలో చేరమని ఆదేశాలు వస్తాయి. ఎంపీ జగ్గయ్య (జగపతిబాబు) ఇంటిపై రైడ్ చేస్తాడు బచ్చన్. అప్పటికే తన కుటుంబానికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బచ్చన్ కోసం జగ్గయ్య వెతుకుతుంటాడు కానీ ఇంతలో బచ్చన్ జగ్గయ్యపై రైడ్ చేస్తాడు. అసలు జగ్గయ్య ఎవరు? ఆనంద్ బచ్చన్ గా ఎలా మారాడు? జిక్కీతో బచ్చన్ ప్రేమ సక్సెస్ అయ్యిందా? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

రివ్యూ:

అజయ్ దేవగన్‌ హిందీలో హిట్ కొట్టిన “రైడ్” సినిమా రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. హరీష్ శంకర్ “రైడ్” స్టోరీని ఆధారంగా తీసుకొని తన స్టైల్ లో తెలుగులో తెరకెక్కించారు. హిందీలో లవ్ ట్రాక్ లేదు. తెలుగులో డైరెక్టర్ ఆ లవ్ ట్రాక్ ని యాడ్ చేసారు. పక్క మాస్ సినిమా ఇది. హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్ ఈ సినిమాలో చాలానే కనిపిస్తాయి. సినిమా అంత రొటీన్ గానే ఉంటుంది. మాస్ ఫైట్ తో హీరో ఇంట్రడక్షన్, తర్వాత హీరోయిన్ తో లవ్ ట్రాక్, తర్వాత మళ్ళీ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా జగ్గయ్యపై రైడ్. అంతగా ఆసక్తిపరిచే సన్నివేశాలు కన్పించవు. పాటలు, హీరోయిన్ ఈ సినిమాకి హైలైట్. సత్య కామెడీ కొంతవరకు పరవాలేదు. జగపతి బాబు, రవితేజ మధ్య సన్నివేశాలు బోరింగ్ గా అనిపిస్తాయి. మిక్కీ మేయర్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి భారీగా మైనస్ అయింది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ బోరింగ్ అనిపించింది. క్లైమాక్స్ కి వచ్చేసరికి రొటీన్ అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

  • రవితేజ, భాగ్య శ్రీ ల కెమిస్ట్రీ
  • డైలాగ్స్
  • ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్:

  • రోటీన్ స్క్రీన్ ప్లే
  • హీరో-విలన్ సన్నివేశాలు
  • సెకండ్ హాఫ్

రేటింగ్: 2.5 / 5

 


End of Article

You may also like