Ads
సాధారణంగా మన ఆలోచనలలాంటివే ఇంకొకరికి వస్తూ ఉండటం చూస్తూనే ఉంటాం. దానికి కొంత మంది కాపీ అని పేరు పెడితే, కొంత మంది ఇన్స్పిరేషన్ అంటారు. ఇలాంటివి సినిమాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒక సినిమా కథని పోలిన కథతో మరొక సినిమా రావడం, కాస్ట్యూమ్స్ ఒకేలా ఉండడం, ఇలాంటివన్నీ అవుతూనే ఉంటాయి.
Video Advertisement
ఇంకా కొన్ని సందర్భాల్లో పాటలు ఒకే లాగా ఉండటం కూడా జరుగుతూ ఉంటాయి. అయితే, అలా ఒక సినిమాలో ఒక పాటకి వాడిన ట్యూన్ ఇంకొక సినిమాలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్యూన్ కి దగ్గరగా ఉంది. వివరాల్లోకి వెళితే. నాగార్జున హీరోగా అంజలా జవేరి, కీర్తి రెడ్డి హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా రావోయి చందమామ. ఈ సినిమాకి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించగా, మణిశర్మ సంగీతం అందించారు.
watch video:
ఈ సినిమాలో ఒక పాటలో ఐశ్వర్యా రాయ్ కనిపిస్తారు. ఈ పాటలో వచ్చే మ్యూజిక్ ఇంకొక సినిమాలో కూడా విన్నాం . అక్కినేని నాగార్జున హీరోగా విజయ భాస్కర్ గారి దర్శకత్వంలో వచ్చిన మన్మధుడు సినిమాని, అందులో బ్రహ్మానందం గారు పోషించిన లవంగం పాత్రని, ఆ లవంగం పాత్రకి వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అస్సలు మర్చిపోలేం.
watch video:
అయితే ఇది సడన్ గా వినంగానే కామెడీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాగానే మనందరికీ స్ట్రైక్ అవుతుంది. కానీ ఈ మ్యూజిక్ రావోయి చందమామ సినిమాలో ఐశ్వర్య రాయ్ కి, నాగార్జున కి మధ్య వచ్చే పాటలోని మ్యూజిక్ కి సిమిలర్ గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి.
End of Article