సినిమాల్లోనే విలన్…రియల్ లైఫ్ లో హీరో..! సోను సూద్ చేసిన ఆ పనికి అందరు ప్రశంసిస్తున్నారు.!

సినిమాల్లోనే విలన్…రియల్ లైఫ్ లో హీరో..! సోను సూద్ చేసిన ఆ పనికి అందరు ప్రశంసిస్తున్నారు.!

by Anudeep

కరోనాకి ఎగెయినస్ట్ గా ఫైట్ చేస్తున్న డాక్టర్స్,పోలీసులు మరియు శానిటేషన్ సిబ్బంది  మా హోటల్లో విశ్రాంతి తీసుకోవచ్చు అని ప్రకటించాడు సోనూసూద్.. సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ ఎక్కువగా వేసే సోనూ ఈ నిర్ణయంతో రియల్ హీరో అనిపించుకున్నాడు.. కరోనా వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించినప్పటికి దేశంలో రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. ప్రభుత్వానికి సాయంగా నటులు ఇతర రంగాల వారు వారి వారి వంతుగా సాయం చేస్తున్నారు..

Video Advertisement

ముంబైలోని జుహు బీచ్ సమీపంలో సోనూసూద్ కి ఆరు అంతస్తుల హోటల్ ఉంది..ఆ హోటల్ ని ఇపుడు తెరిపించారు సోనూసూద్ . హెల్త్ వర్కర్స్, పోలీసులు, పారిశుద్య సిబ్బంది అక్కడ విశ్రాంతి తీస్కోవచ్చని ప్రకటించారు.అంతేకాదు వారికోసం ఉచిత భోజన వసతి కల్పిస్తున్నారు. మనకోసం ఫైట్ చేస్తున్న వాళ్లు రియల్ హీరోస్,వాళ్లు ఎక్కడెక్కడి నుండో వచ్చి ప్రాణాలకు తెగించి మనకు సేవ చేస్తుంటే అలాంటి వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత అని అలాంటి వారికి ఇలా సేవ చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

ఇప్పటివరకు వార్తల్లో చూస్తూనే ఉన్నాము. పోలీసులు, డాక్టర్లు ఇతర సిబ్బంది కుటుంబాలకు దూరంగా , దొరికింది తింటూ, ఉన్న చోటే పడుకుంటూ  కరోనా నుండి ప్రజలను కాపాడడానికి దేశానికి సేవ చేస్తున్నారు. ఎన్నో వార్తలు కంటతడి పెట్టించేవిగా ఉండేవి.. ఇప్పుడు సోనూ నిర్ణయంతో అలాంటి వారిలో కొంతమందికైనా ఫూడ్, ఉండడానికి వసతి దొరికింది . ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు సోనూసూద్ ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఆపదలో ఆదుకోవడానికి ముందుకు వచ్చేవాడే రియల్ హీరో అని కామెంట్ చేస్తున్నారు… ఇప్పుడే కాదు  సమాజంలో ఎలాంటి సమస్య ఎదురైనా సోనూ తన గళం వినిపిస్తుంటాడు.. రియల్లీ హాట్సాప్ హిమ్..

అగ్రరాజ్యం అమెరికా కరోనా ఎఫెక్ట్ తో హడలెత్తి పోతుంటే ,మన దేశంలో పరిస్థితి చేయిదాటితే ఊహించుకోవడం కష్టం . అలాంటి పరిస్తితి రాకూడదనే ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అయినప్పటికి ఇప్పటికే ఆరువేలకు పైగా కేసులు పెరిగిపోయాయి. వీటిల్లో మహరాష్ట్ర లోని ముంబై కేంద్రంగా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. తమ వంతుగా సాయం చేయడానికి బాలివుడ్ కి చెందిన ప్రముకులు ముందుకు వస్తున్నరు.షారూక్ ఖాన్ దంపతులు తమ ఆఫీస్ ని క్వారంటైన్ కేంద్రంగా వాడుకోవచ్చని ప్రకటించారు. అక్షయ్ కుమార్ పిఎం సహాయనిదికి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే..

 


You may also like