“బేబీ” సినిమా ఆ వ్యక్తి జీవితం అధరంగా తీశారా..? ఎవరంటే..?

“బేబీ” సినిమా ఆ వ్యక్తి జీవితం అధరంగా తీశారా..? ఎవరంటే..?

by Mohana Priya

Ads

డైరెక్టర్ సాయి రాజేష్ నేతృత్వంలో రీసెంట్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న చిత్రం బేబీ. మొదటి రోజే ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది ఈ చిన్న సినిమా. ఈ వీకెండ్ పూర్తయ్య సరికి చిత్రం బ్రేక్ ఈవెన్ కూడా చేరుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ హీరోయిన్ గా వైష్ణవి చైతన్యకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.

Video Advertisement

ఈ చిత్రం లో నటించిన ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ కూడా ప్రేక్షకుల ముందు మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఈ మూవీ గురించి మాట్లాడిన డైరెక్టర్ సాయి రాజేశ్…తాను 20 సంవత్సరాల ముందు ఒక అమ్మాయిని ప్రేమించడం వల్ల ఎంతో దారుణమైన బాధ అనుభవించాల్సి వచ్చిందని చెప్పారు.

baby-movie

అప్పుడు తాను పడ్డ బాధని స్క్రీన్ పై ఒక క్యారెక్టర్ రూపంలో తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రాసినట్లు అయన తెలిపారు. అయితే ఇప్పటికీ తన ఫస్ట్ లవ్ తన భార్య అని అయన క్లారిటీ ఇచ్చారు.ఈ మూవీని హీరో పాయింట్ అఫ్ వ్యూలో రాయడం జరిగిందని.. వైష్ణవి పాత్రను బ్యాడ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో చిత్రం లెంత్ ఎక్కువైనా పర్వాలేదని భావించినట్లు ఆయన తెలిపారు.

వైష్ణవి పాత్ర స్క్రీన్ టైం కోసం తగ్గించి ఉన్నట్లయితే ఆమె నెగిటివ్ క్యారెక్టర్ గానే మిగిలిపోయేదన్ని ఆయన తెలిపారు.స్క్రీన్ టైం తక్కువగా ఉన్న కారణంగా విరాజ్ పాత్రకు సరిగ్గా న్యాయం చేయలేకపోయాను అని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం ఉన్న మార్కెట్ స్ట్రాటజీ ప్రకారం చిత్రానికి బేబీ అని పేరు పెట్టాల్సి వచ్చింది అట.

పైగా చిన్న టైటిల్స్ అయితే ప్రేక్షకుల మధ్యకు ఫాస్ట్ గా వెళ్తాయి అని భావించినట్లు డైరెక్టర్ తెలిపారు. మూవీ లెంత్ ఎక్కువ అవడంతో కొన్ని పాత్రలకు సంబంధించిన చాలా పాయింట్స్ మిస్ అయ్యాయని, అందువల్ల కొన్ని వివాదాలు ఎదుర్కోవలసి వస్తోంది సాయి రాజేశ్ చెప్పుకొచ్చారు.

ALSO READ : “బేబీ” మూవీలో “హీరోయిన్ ఫ్రెండ్” గా నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?


End of Article

You may also like