జబర్దస్త్ షో కోసం “గవర్నమెంట్ జాబ్” వదులుకున్న ఈ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా.? లేడీ గెటప్స్ గురించి ఏమన్నారంటే?

జబర్దస్త్ షో కోసం “గవర్నమెంట్ జాబ్” వదులుకున్న ఈ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా.? లేడీ గెటప్స్ గురించి ఏమన్నారంటే?

by Anudeep

Ads

జబర్దస్త్ ఎంతోమంది వర్తమాన  కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది అందులో వెంకీ ఒకరు. మిమిక్రీ, వెంటలోగిజం ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించాడు వెంకీ. ఎన్నో ఈవెంట్లలో తన కామెడీ టైమింగ్ తో అందర్నీ ఆకర్షించాడు.

Video Advertisement

సాదాసీదా ఆర్టిస్టుగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంకీ చాలా తక్కువ టైమ్ లోనే ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఒక ఇంటర్వ్యూ ద్వారా వెంకీ జబర్దస్త్ లో తన ప్రయాణం మరియు లేడీ గెటప్పు వేసుకునేటప్పుడు ఎదురయ్యే కష్టాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. అందుకోసం మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వదులుకున్నాను. జబర్దస్త్ షోతో నా కల నెరవేరింది. ఈటీవీ దయవల్ల నేను ప్రజల ముందుకు వెళ్ళగలిగాను.

నేను కాకతీయ యూనివర్సిటీ నుంచి డిప్లమా ఇన్ మిమిక్రీ లో గోల్డ్ మెడల్ అందుకున్నాను. తర్వాత వీడియో జాకీ, సింగరేణి పాటు కొన్ని ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అంటే అంత సులువైన విషయమేమీ కాదు.

నాకు ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకునే నేను, నాకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం కూడా వదులుకున్నాను. ఎందుకంటే మన గురించి తెలియవలసింది మన ఊర్లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా నా గురించి తెలియజేయాలని అనుకున్నాను. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇది సాధ్యమైంది.

జబర్దస్త్ లో 14 ఎపిసోడ్ తర్వాత నా మిమిక్రీ షో ని చూసిన చంద్రన్న నన్ను పిలిచాడు. ఇప్పుడు నేను ఈ జీవితంలో ఇలా ఉన్నానంటే దానికి చంద్రన్న కారణం. మొదటిలో చంద్రన్న టీమ్ లో 30 ఎపిసోడ్ లు వరకు చేశాను. ఆ తరువాత రాఘవ టీం లో 50 స్కిట్ లు చేస్తే  అందులో 45 లేడీ గెటప్స్ వేసాను. వినోదిని రాకముందు లేడీ గెటప్పులో ఆ క్రెడిట్ మొత్తం నాకే దక్కేది.

లేడీ గెటప్ లు వేయడం అన్నది అంత సులువేమీ కాదు. చీరలో ఉండటం అంటే చాలా కష్టం, దీనికితోడు హెవీ మేకప్ వేసుకోవడం, రకరకాల విగ్గులు ధరించటం ఎంతో కష్టంగా ఉండేది. అప్పుడు నాకు అర్థం అయింది ఆడవారు ఎంత కష్ట పడుతున్నారు అనే విషయం.

రాఘవ టీమ్ నుంచి వేణు అన్న టీం లోకి వెళ్లాను. అక్కడ స్కిట్ లు రాయడం, టైమింగ్ పంచులు ఎలా వేయాలో అనేది నేర్చుకున్నాను. తర్వాత జబర్దస్త్ లో  టీమ్ లీడర్ గా అవకాశం వచ్చింది. నా కంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని ఆలోచనతో కన్ఫ్యూషన్ థీమ్ తో స్కిట్స్ తో వెంకీ మంకీ టీం లీడర్ గా చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాను. ఇలా మంచి స్థాయిలో ఉన్నానంటే జబర్దస్త్ దయవలనే అని వెంకీ ఇంటర్వ్యూలో తన జబర్దస్త్ ప్రయాణం గురించి వెల్లడించారు.


End of Article

You may also like