గీత గోవిందంని “అల్లు అర్జున్” అందుకే రిజెక్ట్ చేశాడా?

గీత గోవిందంని “అల్లు అర్జున్” అందుకే రిజెక్ట్ చేశాడా?

by Anudeep

Ads

కొన్ని సార్లు సినిమాలు ప్లాప్ అవుతాయి అనుకున్నవి ఏమో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంటాయి. బ్లాక్ బస్టర్ అవుతాయి అని అనుకున్నవి కెరీర్ లో చెత్త సినిమాలుగా ఉండిపోతాయి. ఎంత పెద్ద మేధావి అయినా తప్పు చెయ్యక మానరు అన్న దానికి ఇదేనేమో ఉదాహరణ. స్టార్స్ సైతం మంచి సినిమాలని మిస్ చేసుకొని తరువాత అయ్యో…ఎంత పని చేసాము రా అని అనుకుంటుంటారు.రామ్ చరణ్ కి..శ్రీమంతుడు..పవన్ కళ్యాణ్ కి అతడు.మహేష్ బాబు కి ఏ మాయ చేసావే..మొదలైనవి ..ఎన్టీఆర్ మిస్ చేసుకున్నవి అయితే ఇంకా చాలానే ఉన్నాయి.

Video Advertisement

ఇక పోతే 2018 లో తెలుగు లో వచ్చిన ‘గీత గోవిందం’ ఎవ్వరు ఊహించని విజయం సొంతం చేసుకుంది.ఆ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లో అతి పెద్ద హిట్ గా నిలిచింది. అంతెందుకు సినిమా ఈ రేంజ్ లో హిట్ అవుతుందని సినిమా యూనిట్ సైతం ఊహించి ఉండరు.సినిమా లో విజయ్ దేవరకొండ-రష్మిక లు ప్రధాన ఆకర్షణ గా నిలువగా..బాక్స్ ఆఫీస్ రికార్డులు ఎన్నో తిరగ రాసింది..అల్లు అర్జున్ కి ఇష్టమైన సినిమాలలో ఇది కూడా ఒక్కటి .

ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి అభిమానిగా మారిపోయారు అల్లుఅర్జున్.దర్శకులు పరశురామ్ కథ చెప్తున్నప్పుడు గీతా ఆర్ట్స్ నిర్మాతలుతో పాటు బన్నీ కూడా ఉన్నారు అట..సినిమా స్టోరీ వినగానే హిట్ సినిమా అవుతుంది అని కూడా ప్రశంసలు ఇచ్చారట.ఈ విషయాన్నే పలు ఇంటర్వ్యూ లలో పరశురామ్ చెప్పారు.

సినిమా స్ట్రోరి వినగానే ఇది కచ్చితంగా హిట్ సినిమా అవుతుందనే నమ్మకం బన్నీ కి వచ్చిందట.కానీ అప్పటికే సరైనోడు లాంటి కమెర్షియల్ మాస్ సినిమా చేసిన బన్నీ అభిమానుల అంచనాలు అందుకోలేవేమో అనే సందేహంతో ఈ సినిమా జోలికి వెళ్లే ప్రయత్నం చేయలేదట బన్నీ..అంతే కాదు మరికొందరు హీరోల పేర్లు సూచించాడు అట బన్నీ .ఎవ్వరు సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించక పోయేసరికి చివరిగా విజయ్ దేవరకొండ ని సెలెక్ట్ చేసుకున్నారు.


End of Article

You may also like