Home Filmy Adda ఈ ఒకప్పటి స్టార్ హీరోని ఏఎన్నార్ గారు సెట్ లో ఎందుకు కొట్టారు..? ఆరోజు అసలేం జరిగిందంటే..?

ఈ ఒకప్పటి స్టార్ హీరోని ఏఎన్నార్ గారు సెట్ లో ఎందుకు కొట్టారు..? ఆరోజు అసలేం జరిగిందంటే..?

by Anudeep

“శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో వెంకట్. చూడ్డానికి పక్కింటబ్బాయిలా ఉండే వెంకట్ తెలుగు ప్రేక్షకులకు మొదటి సినిమాతోనే తెగ నచ్చేసాడు. ఈ సినిమాలో ఏఎన్నార్ నటన మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించిన వెంకట్ ఆనందం, అన్నయ్య లాంటి తెలుగు సినిమాలో నటించి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో తక్కువ సినిమాలతోనే బాగా పాపులర్ అయిన హీరోల్లో వెంకట్ కూడా ఒకరు.

hero venkat 1

తక్కువ సమయంలోనే స్టార్ డమ్ ని, ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న వెంకట్ చాలా తొందరగానే ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఓ సినిమా షూటింగ్ సమయంలోనే వెన్నెముకకి గాయం అవడంతో ఆయన ఇండస్ట్రీకి దూరం అయ్యి పర్సనల్ బిజినెస్ లో మునిగిపోయారు. ఈ విషయాన్నీ ఆయనే ఓ సారి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఆ తరువాత విలన్ గా తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ కూడా ఇచ్చారు.

hero venkat 3

సుమంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాలో కూడా ఓ మంచి పాత్రలో కనిపించారు. తాజాగా.. రాబోయే లూజర్-2 సినిమాలో కూడా ఓ కీలకపాత్ర పోషించినట్లు తెలిపారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోందని తెలిపారు. ఇటీవల లూజర్-2 టీం తో కలిసి వావ్ షో లో సందడి చేసారు. ఈ సందర్భంగా తన తొలి సినిమా షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్నారు.

hero venkat 2

మొదటి సినిమా షూటింగ్ సమయంలో ఏఎన్నార్ గారు తనని కొట్టారని గుర్తు చేసుకున్నారు. ఓ సీన్ షూట్ చేస్తున్న సమయంలో ఎమోషన్ సరిగా పండలేదని.. అందుకే సరైన ఎమోషన్ రావడం కోసం ఆయన తనని కొట్టారని చెప్పుకొచ్చారు. ఈ వావ్ షో లో హీరో వెంకట్ తో పాటు కల్పిక, సుశాంక్,ప్రియదర్శి, ఆని కూడా పాల్గొన్నారు.

You may also like