Ads
చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత భీమ్లా నాయక్ థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా ఆలస్యం అయ్యింది.
Video Advertisement
సినిమా రీమేక్ అనే విషయం తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉండటంతో, అది కూడా రానా దగ్గుబాటితో మల్టీస్టారర్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
అంతే కాకుండా సినిమాకి సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి. ఆ మార్పులు కూడా వర్కవుట్ అయ్యాయి. మన నేటివిటీకి తగ్గట్టు చేసిన ఆ మార్పులు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి. ఒరిజినల్ సినిమా కంటే తెలుగు సినిమా దాదాపు 30 నిమిషాల నిడివి తక్కువ ఉంటుంది. వీటన్నిటి వల్ల సినిమా క్రేజ్ ఇంకా పెరగడంతో సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోయింది. మళ్లీ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ కి ఈ సినిమాతో అంత పెద్ద హిట్ పడింది అని అంటున్నారు.
ఈ సినిమాలో తెలుగు, మలయాళ వెర్షన్‌కి చాలా మార్పులు ఉన్నాయి. సినిమా క్లైమాక్స్‌లో కూడా కొన్ని మార్పులు జరిగాయి. అసలు అయ్యప్పనుం కోషియుమ్ లో క్లైమాక్స్ ఇలా ఉండదు. కానీ తెలుగులో మాత్రం రానా దగ్గుబాటి పోషించిన డేనియల్ శేఖర్ పాత్ర భార్య వచ్చి బాధ పడడం చూసి భీమ్లా నాయక్ శేఖర్ ని వదిలేస్తాడు. అంతే కాకుండా తప్పు శేఖర్ ది అన్నట్టు చెప్తారు. కానీ మలయాళం వెర్షన్‌లో కోషి పాత్రకి భార్య ఉండడం లాంటివి చూపించలేదు. అలా తెలుగులో చాలా మార్పులు జరిగాయి. అయితే ఈ మార్పుల వెనకాల ఒక కారణం ఉంది.
సాధారణంగా గత కొంత కాలం నుండి వస్తున్న త్రివిక్రమ్ సినిమాలు చూస్తూ ఉంటే చివరిలో ఆడవాళ్ళు ఎన్నో యుద్ధాలను ఆపగలరు అని ఉద్దేశం వచ్చేలాగా చూపిస్తున్నారు. ఈ సినిమాలో కూడా అదే విధంగా చూపించడానికి ప్రయత్నం చేశారు. ఆ కారణంగానే డానియల్ శేఖర్ భార్య పాత్ర చివరిలో రావడం జరుగుతుంది. దాంతో డానియల్ శేఖర్ తను చెల్లెలిలా భావించిన అమ్మాయి భర్త అని తెలుసుకున్న భీమ్లా నాయక్ డానియల్ శేఖర్ ని వదిలేస్తాడు. అందుకే కథలో ఈ విధంగా మార్పులు చేశారు.
End of Article