Ads
ఆర్ఆర్ఆర్ సినిమా నుండి ఇటీవల విడుదలైన దోస్తీ పాట ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటని తెలుగులో హేమచంద్ర, తమిళ్ లో అనిరుధ్ రవిచందర్, కన్నడలో యాజిన్ నిజార్, మలయాళంలో విజయ్ ఏసుదాస్, హిందీలో అమిత్ త్రివేది పాడారు. ఈ పాటలో సప్రైజ్ గా చివరిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా కనిపిస్తారు. ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
Video Advertisement
అయితే ఈ పాటని మనలో చాలా మంది ఐదు భాషల్లో వినే ఉంటారు. ఒకసారి యూట్యూబ్ లో 5 భాషల పాటలకి వ్యూస్ గమనిస్తే తెలుగులో 15 మిలియన్, తమిళ్ లో 5 మిలియన్, కన్నడలో 1.7 మిలియన్, మలయాళంలో 1.5 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఈ రకంగా చూసుకుంటే ఈ పాట తెలుగులో తప్ప వేరే ఏ భాషలో హిట్ అవ్వలేదు. విన్న వారు కూడా ఎక్కువగా తెలుగు భాష లోనే విన్నారు.
మిగిలిన భాషలలో కూడా పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయినా సరే వ్యూస్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఇంక హిందీ విషయానికొస్తే హిందీలో కూడా దాదాపు 15 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. కానీ సాధారణంగా హిందీలో ఏదైనా ఒక పాట విడుదల అయితే, వారం రోజుల్లోనే దాదాపు 100 మిలియన్ వ్యూస్ వచ్చేస్తాయి. అలాంటిది ఇంత మంచి పాటకి ఇంకా 50 మిలియన్ వ్యూస్ కూడా రాకపోవడం ఏంటి అని అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేశారు.
ఏదేమైనా సరే, మనం ఒకసారి అంతకు ముందు గమనిస్తే బాహుబలి విషయంలో కూడా పాటలు అంత పెద్దగా ప్రజాదరణ పొందలేదు. కానీ సినిమా రిజల్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ కూడా దాదాపు అలాగే అవకాశం ఉంది. ఈ సినిమా గురించి భారతదేశం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కేవలం మన 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి నెలకొంది.
End of Article