Ads
రవితేజ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చక్కటి తెలుగు సినిమాలు చేసి పాపులర్ అయ్యాడు రవి తేజ. మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని రవి తేజ. అయితే రవితేజ పేరు వెనుక ఎవరికీ తెలియని పెద్ద కధే వుంది. మరి రవి తేజ తన పేరుని ఎందుకు అలా మార్చుకున్నాడు..? అసలు పేరు ఏమిటి అనేవి చూద్దాం.
Video Advertisement
రవి తేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. కానీ ఈ మాస్ మహా రాజా పేరుని మార్చుకోవడానికి కారణం చిరు సినిమానే. సినిమాల్లోకి రాక ముందు అతన్ని అందరు రవిశంకర్ రాజు అనే పిలిచే వారు.
అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక రవిశంకర్ రాజు ని కాస్తా రవి తేజ గా మార్చుకున్నాడు. చిరంజీవి నటించిన దొంగమొగుడు మూవీ ఏ దీనికి కారణం. యండమూరి వీరేంధ్రనాథ్ ‘నల్లంచు తెల్లచీర’ నవల ఆధారంగా దొంగమొగుడు మూవీ ని తీశారు. ఈ సినిమాలో మెగా స్టార్ ద్విపాత్రిభినయం చేసారు. అందులో నాగరాజు, రవి తేజ అనే రెండు పాత్రలను మెగా స్టార్ చేసారు. అయితే రవి తేజ అనే పాత్ర నచ్చి రవితేజ అతని పేరునే మార్చేసుకున్నారు.
ఇదిలా ఉంటే చిరు సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఎప్పుడు లేనంత స్పీడ్ గా వరుస సినిమాలు ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నాడు.. మరో వైపు రానున్న సినిమాలో మాస్ మహారాజ్ రవి తేజతో ఓ సినిమాలో తెరపంచుకోనుండటం ఆసక్తికరంగా మారింది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న కొత్త సినిమాలో రవితేజ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. 2000 లో విడుదలైన “అన్నయ్య” సినిమాలో చిరంజీవి తమ్ముడి పాత్రలో కనిపించిన మాస్ మహారాజా రవితేజ 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ చిరంజీవి సినిమాలో కనిపించబోతున్నారు.
End of Article