“చంద్రబాబు నాయుడు” జైల్ లో ఉంటే… “జూనియర్ ఎన్టీఆర్” దుబాయ్ కి..? కానీ కారణం ఏంటంటే..?

“చంద్రబాబు నాయుడు” జైల్ లో ఉంటే… “జూనియర్ ఎన్టీఆర్” దుబాయ్ కి..? కానీ కారణం ఏంటంటే..?

by Mohana Priya

Ads

రెండు తెలుగు రాష్ట్రాలని షాక్ కి గురి చేసిన విషయం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాక చంద్రబాబు కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడిని చూడడానికి జైలుకు వెళ్లారు.

Video Advertisement

ఇవాళ ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడుని కలవడానికి వెళ్లారు. నారా కుటుంబం, నందమూరి కుటుంబం బంధువులు అనే విషయం అందరికీ తెలిసిందే. దాంతో నందమూరి బాలకృష్ణ కూడా చంద్రబాబు నాయుడుని కలిశారు.

reason behind jr ntr travelling to dubai

అయితే ఇదిలా ఉండగా, చంద్రబాబు అరెస్ట్ అయ్యారు అనే విషయం చర్చనీయాంశమైన అంశంగా మారితే, చంద్రబాబు అరెస్ట్ అయ్యాక బంధువు అయిన జూనియర్ ఎన్టీఆర్ ఒక్క సారి కూడా ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా కానీ, లేదా మరి ఏ రకంగా కానీ స్పందించకపోవడం అనేది ఇంకా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఇంత మంది ఈ విషయంపై పలు రకాలుగా స్పందిస్తున్నారు.

ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా ఈ విషయంపై మాట్లాడారు. కానీ “జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు” అని అందరూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాకుండా నందమూరి కుటుంబంలోని మరొక హీరో కళ్యాణ్ రామ్ కూడా ఈ విషయంపై స్పందించడం, లేకపోతే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడుని కలవడం కానీ చేయలేదు.

why jr ntr did not attended ntr coin launch

అసలు విషయం ఏమీ అయి ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. అంతే కాకుండా ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణ వేడుకలో కూడా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా పాల్గొనలేదు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు అని చెప్పారు. ఇటీవల దేవర సినిమా షెడ్యూల్ మొదలు అయ్యింది అని, జూనియర్ ఎన్టీఆర్ ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు అని అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ విమానాశ్రయంలో కనిపించారు. జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్ వెళ్తున్నారు. అందుకు కారణం ప్రతిష్టాత్మకమైన సైమా అవార్డ్స్ వేడుకలు దుబాయిలో జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ హాజరు అవుతారు. దీని కోసమే ఎన్టీఆర్ దుబాయ్ వెళ్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో ప్రస్తుతం ఉన్న చర్చలు ఇంకా పెరిగాయి. “ఒక పక్క బంధువు జైల్ లో ఉంటే ఇలా వెళ్లడం ఏంటి?” అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

ALSO READ : 20 ఏళ్ళ క్రితం హీరోయిన్ గా చేసిన హీరోకి… ఇప్పుడు తల్లిగా చేస్తున్న స్నేహ..! ఆ హీరో ఎవరంటే..?


End of Article

You may also like