Ads
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ పూర్తయినా కూడా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఇందులో చిరంజీవి పక్కన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత వారిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండవ సినిమా ఇది.
Video Advertisement
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కలం తర్వాత ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడడం, అది కూడా ఇద్దరినీ ఫుల్ లెన్త్ రోల్ లో చూడడం అనే విషయం సినిమా మీద ఆసక్తిని ఇంకా పెంచింది.
ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డేతో పాటు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న నటీనటులు కనిపించారు. ఈ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా కాజల్ నటిస్తున్నారు. కానీ ట్రైలర్ లో మాత్రం ఒక్క చోట కూడా కాజల్ అగర్వాల్ కనిపించలేదు. అసలు ఆచార్య సినిమాలో హీరోయిన్ గా ముందుగా త్రిషని అనుకున్నారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల త్రిష ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్టు చెప్పారు. సినిమాలో కాజల్ పాత్ర కంటే పూజా హెగ్డే పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందట.
ఈ కారణంగానే ట్రైలర్ లో కాజల్ పాత్ర ఎక్కువగా కనిపించలేదు. సినిమాలో రామ్ చరణ్ పాత్ర కీలకమైన పాత్ర. ఆ పాత్ర చుట్టూనే సినిమా అంతా తిరుగుతుంది. దాంతో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ పాత్ర చేసిన పూజ హెగ్డే సినిమాలో ఎక్కువ సేపు కనిపిస్తారు. కానీ కాజల్ మాత్రం నిడివి మాత్రం చాలా తక్కువగా ఉంటుంది అని సమాచారం. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకోవాలంటే సినిమా విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.
End of Article