Home Filmy Adda వైరల్ అయిన “ఎన్టీఆర్” న్యూ లుక్ ఫోటో చూసే ఉంటారు…కానీ ఆ లుక్ దేనికోసమో తెలుసా ..?

వైరల్ అయిన “ఎన్టీఆర్” న్యూ లుక్ ఫోటో చూసే ఉంటారు…కానీ ఆ లుక్ దేనికోసమో తెలుసా ..?

by Anudeep

ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ నేపథ్యం తారక్ వరుస ప్రాజెక్టులకు సైన్ చేసారు. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ 30 వస్తున్న సినిమా వస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు కొరటాల శివతో ఒక బిగ్గెస్ట్ మాస్ ప్రాజెక్ట్ ని చేయబోతున్నాడు ఎన్టీఆర్.

ఆ సినిమా గురించి అప్ డేట్స్ కోసం.. తదుపరి సినిమాల అనౌన్స్మెంట్ ఎప్పుడు జరుగుతుందా? అని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కొత్త లుక్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు చూసి, ఎన్టీఆర్ లుక్ చూసి అభిమానులు సంబరపడిపోతోన్నారు.

Reason behind NTR new look..

అయితే ఈ లుక్ ఒక యాడ్ కోసం అని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ హీరోకి పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం కోసం ఎన్నో కంపెనీలు ఎన్టీఆర్ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నాయి.ఇప్పటికే పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ తాజాగా మరొక బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓ ప్రముఖ బ్రాండ్ కమర్షియల్ యాడ్ కోసమే ఎన్టీఆర్ ఇలా మేకోవర్ అయ్యారని తెలుస్తోంది.

Reason behind NTR new look..

ఇకపోతే ఈ యాడ్ లో ఎన్టీఆర్ నటించడం కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కమర్షియల్ యాడ్ కోసం ఎన్టీఆర్ ఏకంగా పది కోట్ల రూపాయలు చార్జ్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ చేశారని టాక్. ఈ యాడ్ కోసం సదరు సంస్థ భారీ సెట్టింగ్స్ కూడా వేసిందని అంటున్నారు.

Reason behind NTR new look..
ఇక ఈ యాడ్ చేయడం కోసం సదరు సమస్థ భారీ మొత్తంలోనే ఖర్చుపెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.అయితే త్వరలోనే ఈ యాడ్ కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

You may also like