Ads
సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అర్థం చేసుకోలేం. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు బోల్తా పడతాయి.
Video Advertisement
కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొడతాయి.
అలాగే సినిమాలో నటించే హీరో హీరోయిన్ల విషయంలో కూడా అప్పుడప్పుడు అనుకోని మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాంటి మార్పు మురారి సినిమా సమయంలో జరిగింది. దీంతో ఆ హీరోయిన్ ఆ సినిమాలో నటించడం మిస్ అయింది. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం..?మహేష్ బాబు సినీ జీవితంలోనే మంచి పేరు తీసుకు వచ్చిన సినిమా మురారి అని చెప్పవచ్చు. ఈ సినిమాను నందిగం రామలింగేశ్వర రావు నిర్మించగా, కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. 2021లో వచ్చినటువంటి ఈ మూవీ యూత్ ను అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. అలాగే కైకాల లక్ష్మి ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ నిర్మాత నందిగం రామలింగేశ్వర రావు కు మరియు కృష్ణకు చాలా దగ్గరి అనుబంధం ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ లో అనేక మూవీస్ వచ్చాయి. ఈ తరుణంలోనే కృష్ణ కొడుకు మహేష్ బాబు తో కూడా ఒక సినిమా తన బ్యానర్ లో తీయాలని కచ్చితంగా హిట్ అవ్వాలని రామలింగేశ్వరరావు అనుకున్నారు. కథ మరియు కథనాల పరంగా సినిమా యువతకు ఫ్యామిలీస్ కి బాగా నచ్చింది. కెరీర్ పరంగా మహేష్ బాబుకు ఇది నాలుగవ సినిమా. మహేష్ బాబు గత సినిమాలతో పోలిస్తే మాత్రం చాలా ఎక్కువ బడ్జెట్ లో ఈ మూవీకి పెట్టారు. దీనికి అప్పట్లోనే ఎన్ని కోట్ల బడ్జెట్ అయింది అంటే ఆ సినిమా హిట్ అవ్వాలంటే 20 రోజులు థియేటర్స్ లో హౌస్ ఫుల్ ఉండాలి. కానీ మూవీ విడుదలైన తొలి వారంలోనే సినిమాకి అనుకున్నంత స్థాయిలో వసూలు కాలేదు. సినిమా కష్టం అనుకున్నారు. కానీ రెండో వారం నుంచి సినిమా చాలా పికప్ అయింది. 175 రోజుల నుంచి 200 రోజుల వరకు ఆడి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. వసూళ్లు కూడా చాలా వచ్చాయి. అయితే ఈ మూవీలో ముందుగా హీరోయిన్ గా వసుంధర దాస్ ను తీసుకుందామని కృష్ణవంశీ పట్టుబట్టారట.అయితే నిర్మాత సోనాలి వైఫై మొగ్గు చూపడంతో ఆ సినిమాకు సోనాలి చాలా ప్లస్ అయింది అని రిలీజ్ అయ్యాక తెలిసింది. వారిద్దరి కాంబినేషన్ చాలా హిట్ అయ్యింది. అలాగే సినిమాకు కెమెరామెన్ గా భూపతిని తీసుకుందామని కృష్ణవంశీ అనుకుంటే నిర్మాత మాత్రం శ్రీ రామ్ ప్రసాద్ ను తీసుకున్నాడు. ఈ విధంగా సినిమా చివరి వరకు మనస్పర్థలు ఉండడంతో మూవీ 100 రోజుల ఫంక్షన్ కూడా ఆ రోజుల్లో చేయలేదని అంటారు. ఈ విధంగా వసుంధర దాస్ మహేష్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించే ఛాన్స్ ను కోల్పోయిందని తెలుస్తోంది.
https://www.telugulives.com/telugu/2022/05/do-you-know-murari-movie-first-heroine-bad-luck/
End of Article