సినిమాలకు శ్రియ దూరం అవ్వటానికి కారణం ఇదేనట?

సినిమాలకు శ్రియ దూరం అవ్వటానికి కారణం ఇదేనట?

by Anudeep

టాప్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు వరుస పెట్టి సినిమాలు చేసిన హీరోయిన్ శ్రీయ ..ఇప్పుడు మాత్రంచాలా తక్కువ సినిమాలలో కనిపిస్తుంది.దీనికి కారణం ఆమెకు అవకాశాలు లేక అని చాలా మంది అనుకున్నారు..ఇలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ అన్నింటికీ సమాధానాలు ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ.ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి కానీ తనకు దర్శకులు చెప్పే పాత్రలు నచ్చకే సినిమాలు చెయ్యట్లేదు అని చెప్పుకొచ్చింది.మరీ ముఖ్యంగా కొంత మంది మొదట స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు క్యారెక్టర్ ఒక లాగా..సెట్స్ మీదకి తీసుకువెళ్లాక మరొక లాగ మార్చివేస్తున్నారు అని చెప్పింది.వెండి తెరకు దూరం అవ్వటానికి ఇది కూడా ఒక కారణం అంటూ చెప్పుకొచ్చింది.

Video Advertisement

తాను చేసే స్పెషల్ సాంగ్స్ (ఐటెం సాంగ్స్) గురించి కూడా ఆసక్తికరంగా స్పందించింది శ్రీయ. ఒక వైపు హీరోయిన్ గా నటిస్తూ స్పెషల్ సాంగ్స్ చెయ్యటం మొదలు పెట్టింది నేనే అంటూ ఈ ట్రెండ్ ని నేనే మొదలు పెట్టాను అంటూ చెప్పింది శ్రీయ.స్పెషల్ సాంగ్స్ చేస్తే హీరోయిన్ గా అవకాశాలు రావు అంటూ హీరోయిన్స్ భయపడే వారు అంటూ అలాంటి వార్తలు అన్ని తప్పు అంటూ ముందుకు వచ్చి నేను ధైర్యంగా చేశాను అంటూ చెప్పింది.

ప్రస్తుతం శ్రీయ తన భర్త తో కలిసి యూరోప్ లో సమయం గడుపుతుంది.కరోనా మహమ్మారి అక్కడ ఎలా విజృంభిస్తుందో చెప్పనవసరం లేదు..అక్కడ పరిస్థితుల కారణంగా ఇంట్లోనే ఉంటుంది.ఇలాంటి సమయం లో తన భర్త కు కరోనా లక్షణాలు కనపడటంతో శ్రీయ తీవ్ర కలత చెందింది.కానీ ఇప్పుడు శ్రీయ భర్త ఆరోగ్యం కుదుట పడటంతో ఊపిరి పీల్చుకుంది. అయితే అక్కడ పరిస్థితుల కారణంగా ఇల్లు వదిలి కదిలే పరిస్థితి అస్సలు కనపడటం లేదు.సామాజిక మాధ్యమాలు అయిన ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో తరచూ అందుబాటులో ఉంటుంది శ్రీయ.


You may also like

Leave a Comment