“రాధేశ్యామ్” సినిమాలో బెడ్ రూమ్ సీన్స్ వెనుక అసలు కథ అదేనా..? అందరిముందు అలా చేయాల్సొచ్చేసరికి..?

“రాధేశ్యామ్” సినిమాలో బెడ్ రూమ్ సీన్స్ వెనుక అసలు కథ అదేనా..? అందరిముందు అలా చేయాల్సొచ్చేసరికి..?

by Anudeep

Ads

ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యామ్‌తో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ భారతదేశం అంతటా వ్యాపించింది. బహుశా ప్రభాస్ తెలియని ఇండస్ట్రీ ఉండదేమో.

Video Advertisement

అందుకే బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యింది. ఇప్పుడు రాబోతున్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగా విడుదల అవుతున్నాయి.

radheshyam 2

ఎటువంటి అంచనాలు లేకుండా ప్రారంభమైన రాధేశ్యామ్ సినిమా.. ట్రైలర్లు, టీజర్లు రిలీజ్ ఐయ్యాక ఓ రేంజ్ లో అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో ప్రభాస్ హస్తసాముద్రికుడిగా కనిపించనున్నారు. చేతిపై ఉన్న గీతలని చూసి జాతకాలు చెప్పగలుగుతూ ఉంటాడు. ట్రైలర్ కట్ లో కనిపించిన సీన్స్, మ్యూజిక్ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేస్తున్నాయి.

radheshyam glimpse

ఇప్పటివరకు ఎక్కువగా మాస్ సినిమాలనే చేసిన ప్రభాస్.. ఇప్పుడు పూర్తిస్థాయి ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బెడ్ రూమ్ సీన్స్ కూడా ఉన్నట్లు ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది.ఈ సీన్స్ గురించి ఓపెన్ అయిన ప్రభాస్.. ఈ సన్నివేశాలు చేసేటప్పుడు బాగా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా షూటింగ్ జరుగుతున్నప్పుడు.. సెట్లో అంతమంది ఉండగా.. వారి మధ్యలో షర్ట్ లేకుండా కిస్ చేయాల్సి వచ్చినపుడు బాగా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు.

ఇప్పటివరకు యాక్షన్ సినిమాలే చేయడం వలన ముద్దు సీన్ల నుంచి ఎస్కేప్ అవ్వగలిగానని.. కానీ ఇది పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రం అవ్వడం వలన దర్శకుడు చెప్పినట్లు చేయలేక తప్పలేదని ప్రభాస్ చెప్పుకొచ్చారు. కానీ, అంతమంది ముందు చేయడం మాత్రం కొంచం ఇబ్బంది అనిపించిందని చెప్పుకొచ్చారు.


End of Article

You may also like