Ads
సాధారణంగా ఇయర్ ఫోన్స్ కు ఇయర్ లో పెట్టుకునే ప్లగ్ వద్ద మాత్రమే హోల్స్ ఉంటాయి. తద్వారా మనం మొబైల్ లో ప్లే చేసే మ్యూజిక్ ను వినగలుగుతూ ఉంటాము. అయితే.. కొన్ని ఇయర్ ఫోన్స్ లో మాత్రం ఈ ఇయర్ ప్లగ్ బయట కూడా హోల్స్ ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయి అన్న డౌట్ ఎప్పుడైనా వచ్చిందా?
Video Advertisement
కొన్ని ఇయర్ ఫోన్స్ కి ఎక్స్ట్రా హోల్స్ ఎందుకు ఇస్తారో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. నిజానికి ఇయర్ ప్లగ్ లో ఉండే హోల్స్ వల్లే సౌండ్ ట్రాన్స్మిట్ అయ్యి అది మనకి వినిపిస్తూ ఉంటుంది.
కానీ ఇయర్ ప్లగ్ బయట ఉండే హోల్స్ సౌండ్ ను ట్రాన్స్మిట్ చేయలేవు. చాల వరకు ఆపిల్ ఇయర్ ఫోన్స్, సోనీ ఇయర్ ఫోన్స్ లలో ఇలా ఇయర్ ప్లగ్ బయట కూడా హోల్స్ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఆపిల్ ఇయర్ ఫోన్స్ ను నిశితంగా గమనించి చూస్తే ఇయర్‌పాడ్‌ల వెనుక మరియు దిగువన కొన్ని ఎక్సట్రాగా హోల్స్ ఉండడాన్ని మీరు చూస్తారు. దీని వెనుక ఓ చిన్న రహస్యమే ఉంది.
ఈ హోల్స్ సౌండ్ ను ప్రసారం చేయకపోయినా మీరు మీకు ఇష్టమైన పాటలని వినడానికి ఎంతగానో హెల్ప్ చేస్తాయి. మీ ఇయర్ కెనాల్ లో గాలిని చొరబడనివ్వకుండా ఈ రంధ్రాలు అడ్డుకుంటాయి. అంతేకాకుండా ఈ రంధ్రాల వలన ఇయర్ ఫోన్ నాణ్యత కూడా బాగుంటుంది. వాక్యూమ్‌ను ఉత్పత్తి చేయడానికి, శ్రోతలకు మెరుగైన ధ్వనిని అందించడానికి మరియు ఇయర్‌పాడ్‌లు స్థానంలో ఉండటానికి సహాయపడటానికి ఈ రంధ్రాలు ఉపయోగపడతాయి. అలాగే మీరు కదులుతున్నప్పుడు.. అలాగే ఏదైనా పెద్ద శబ్దాలు అవుతున్నప్పుడు వాటికి మీరు డిస్టర్బ్ అవ్వకుండా కూడా ఈ రంధ్రాలు దోహదం చేస్తాయి.
End of Article