Ads
దేశవ్యాప్తంగా పలు మార్కెట్లలో ఒక్క నిమ్మకాయ రూ.10-15 వరకు విక్రయిస్తున్నారు. చాలా మార్కెట్‌లలో ఒక్క నిమ్మకాయ రూ.10 నుండి రూ.15 మధ్యలో ఉంది. భారతదేశం యొక్క నిమ్మ ఉత్పత్తి యొక్క పరిధి, ధర పెరుగుదల వెనుక గల కారణాలు, ఇంకా ఈ నిమ్మకాయల ధర ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది అన్న విషయాన్నీ ఈ ఆర్టికల్ లో చూద్దాం.
Video Advertisement
గత కొన్ని వారాలుగా, నిమ్మకాయ ధర అనూహ్యంగా గరిష్ట స్థాయికి చేరుకుంది, దేశంలో నిమ్మకాయను పండించిన లెక్కలను బట్టి ధరను నిర్ణయిస్తారు. ఉత్పత్తి తగ్గిన పక్షంలో డిమాండ్ పెరిగి ధర కూడా ఎక్కువ అవుతుంది.
దేశవ్యాప్తంగా పచ్చిమిర్చి, టమాటా, క్యాప్సికమ్ వంటి కూరగాయల ధరలతో పాటు నిమ్మకాయల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఎప్పుడు లేనిది ఒక్కసారిగా నిమ్మకాయల ధర పెరగడంతో సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్ లో ట్రోల్స్ వస్తున్నాయి. ఢిల్లీలో, వేసవిలో అవసరమైన సిట్రస్ పండ్ల ధర కిలోకు రూ. 300 నుండి రూ. 350 వరకు ఉంటుంది, అంటే ఒక్క కాయ కూడా రూ. 10 కంటే ఎక్కువ. అదేవిధంగా గుజరాత్‌లోని హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.300 వరకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఒక కూరగాయల విక్రేత మాట్లాడుతూ తాను మొత్తం నిమ్మకాయ బస్తాను రూ.700కు కొనుగోలు చేసేవాడినని, అయితే ఇప్పుడు దాని ధర రూ.3,500 అని చెప్పాడు.
నిమ్మకాయల ఉత్పత్తికి పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఆ ప్రభావం పంటలపైనా పడింది. సాధారణంగా వేసవి కాలంలోనే నిమ్మకాయల అవసరం ఎక్కువ ఉంటుంది. ఎండ మండిపోతుంటే.. చల్లగా నిమ్మకాయ సోడా, లేక నింబు పానీని తాగినా తక్షణమే రిలీఫ్ వస్తుంది. అయితే ఉష్ణోగ్రతల ప్రభావం పంటపై పడడంతో ఉత్పత్తి తగ్గిపోయింది. మరోవైపు పెట్రోల్, డీజిల్ మరియు CNG ధరల పెరుగుదల ఫలితంగా రవాణా ఖర్చులు పెరిగాయి. దీనితో నిమ్మకాయల ధర కూడా పెరిగిపోయింది.
రవాణా ఖర్చులు పెరగడం, అంతిమంగా కొనుగోలు ధర పెరగడంతో ఎక్కువ ధరకు అమ్మక తప్పడం లేదని అమ్మకందారుల చెబుతున్నారు. అయితే, తుఫాను కారణంగా గుజరాత్‌లో పంటలు దెబ్బతినడం కూడా పరిస్థితిని మరింత దిగజార్చింది. “గుజరాత్‌లో ప్రకృతి వైపరీత్యం కారణంగా నిమ్మకాయల ధరలు మరింత పెరిగాయి. మరోవైపు వేసవి కావడంతో.. నిమ్మకాయ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడం, రవాణా ఖర్చులు కూడా పెరగడం నిమ్మకాయ ధర పెరగడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
End of Article