Ads
తెలుగులో ఎన్నో సినిమాల్లో ఎన్నో ముఖ్య పాత్రల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులకు చేరువయ్యారు ప్రభాస్ శ్రీను. ప్రభాస్ శ్రీను గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఇందులో ముఖ్యంగా మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు ప్రభాస్ శ్రీను కి ఎంతగానో పేరు తీసుకువచ్చాయి.
Video Advertisement
అయితే ప్రభాస్ శ్రీను కి ఆ పేరు ఎలా వచ్చిందో చాలా మందికి తెలియదు. ఈ విషయంపై ప్రభాస్ శ్రీను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పేరు వెనకాల ఉన్న కథ గురించి చెప్పారు. ప్రభాస్ శ్రీను ఎంతో మంది యాక్టర్స్ కి శిక్షణ ఇచ్చిన సత్యానంద్ గారి దగ్గర నటనలో శిక్షణ పొందారు.
అక్కడే ప్రభాస్ కూడా నటనలో శిక్షణ పొందారు. శ్రీను కి ప్రభాస్ తో దాదాపు పది సంవత్సరాల పైన పరిచయం ఉందట. రాఘవేంద్ర సినిమా నుంచి కూడా ప్రభాస్ తో శ్రీను అసోసియేట్ అయ్యి ఉన్నారట. అప్పటి నుంచి శ్రీను కి ప్రభాస్ ఎంతగానో సపోర్ట్ చేశారట. అలా తన స్క్రీన్ నేమ్ ప్రభాస్ శ్రీను అయ్యింది.
ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా శీనుని కేవలం శ్రీను అనే పేరుతో కంటే కూడా ప్రభాస్ శ్రీను అనే పేరుతోనే ఎక్కువగా గుర్తు పడుతున్నారు. ప్రభాస్ పేరు తన స్క్రీన్ నేమ్ తో కలిసినందుకు తనకి చాలా ఆనందంగా ఉంటుంది అని ప్రభాస్ శ్రీను ఎన్నో సందర్భాల్లో చెప్పారు.
watch video :
End of Article