ఫ్యాక్టరీల పై ఇవి ఎప్పుడైనా గమనించారా.? అవి ఎందుకు ఉంటాయో తెలుసా.?

ఫ్యాక్టరీల పై ఇవి ఎప్పుడైనా గమనించారా.? అవి ఎందుకు ఉంటాయో తెలుసా.?

by Mohana Priya

Ads

ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి అయ్యిందా? కాలేదా? అని చూడాలంటే అక్కడ ఉన్న ఫ్యాక్టరీలను చూసి చెప్పవచ్చు. ప్రతి ప్రాంతంలో ఏదో ఒక ఫ్యాక్టరీ కచ్చితంగా ఉంటుంది. అందులో ఎంతో మంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఫ్యాక్టరీలో ఎన్నో రకాలు ఉంటాయి. ఎన్నో వస్తువులను ఈ ఫ్యాక్టరీలలోనే తయారు చేస్తూ ఉంటారు.

Video Advertisement

Reason behind using wind ventilators in factories

ఎంతో మంది ఎన్నో గంటలు శ్రమించి, మనకి కావాల్సిన వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. అయితే మనలో చాలా మంది ఫ్యాక్టరీలను చూసే ఉంటారు. ఫ్యాక్టరీలతో పాటు ఫ్యాక్టరీల మీద ఉండే ఒక వస్తువును కూడా చూసే ఉంటారు. అది సర్కిల్ షేప్ లో, ఎక్కువగా వెండి రంగులో ఉంటుంది. ఫ్యాక్టరీ మీద ఉండే ఈ వస్తువు ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. దీని పేరు విండ్ వెంటిలేటర్.

Reason behind using wind ventilators in factories

అయితే ఈ విండ్ వెంటిలేటర్స్ ఫ్యాక్టరీల మీద ఎందుకు ఉంటాయి అని ఒక అనుమానం మనకి వస్తుంది. ఫ్యాక్టరీలలో పని చేసేటప్పుడు, మిషన్లు పని చేసే సమయంలో వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడి వల్ల ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. దాంతో ఆ ఉద్యోగులు సరిగ్గా పని చేయలేరు. ఈ వేడిని తగ్గించడానికి ఫ్యాక్టరీలో విండ్ వెంటిలేటర్స్ ఏర్పాటు చేస్తారు.

Reason behind using wind ventilators in factories

వేడి గాలి తేలికగా ఉంటుంది. ఫ్యాక్టరీలో ఉండే ఆ వేడి మొత్తం ఈ విండ్ వెంటిలేటర్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఆ వేడి మొత్తం బయటకు వెళ్లిపోయిన తర్వాత టెంపరేచర్ మళ్లీ నార్మల్ కి వస్తుంది. దాంతో మళ్ళీ ఉద్యోగులు మామూలుగా పని చేయగలుగుతారు. ఈ కారణంగా ఫ్యాక్టరీలలో విండ్ వెంటిలేటర్లను ఏర్పాటు చేస్తారు.


End of Article

You may also like