“ట్రైన్” లో మూవీ షూటింగ్ కి ఎంత తీసుకుంటారో తెలుసా..? ఎంత సమయానికి ఛార్జ్ చేస్తారంటే?

“ట్రైన్” లో మూవీ షూటింగ్ కి ఎంత తీసుకుంటారో తెలుసా..? ఎంత సమయానికి ఛార్జ్ చేస్తారంటే?

by Mohana Priya

Ads

ఇండియన్ మూవీస్ కి రైల్వే సన్నివేశాలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు మనం చాలా చిత్రాల్లో రైలు సన్నివేశాలను చూస్తూ ఉంటాం. కొన్ని చిత్రాలు రైల్వే స్టేషన్ లోని, లేక రైలు కంపార్ట్మెంట్లలో జరుగుతూ ఉంటుంది. హీరో లేక హీరోయిన్ ఎంట్రెన్స్ వంటి సన్నివేశాలు ఇలా ఎన్నో చిత్రాల్లో చిత్రీకరించబడ్డాయి. మరికొన్ని చిత్రాలు ఏకంగా రైలు కంపార్ట్మెంట్ లోనే  సగం వరకు పూర్తి చేస్తూ ఉంటారు.

Video Advertisement

మరి అసలు విషయానికొస్తే ఇలా రైల్వే స్టేషన్ లో లేక ట్రైన్ కంపార్ట్మెంట్ లో సన్నివేశాలను చిత్రీకరించడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా… చిత్రనిర్మాణం చేయటం ద్వారా రైల్వే శాఖకు ఎంత రాబడి వస్తుందని విషయం మనం తెలుసుకుందాం.

Train movie sences

మునుపటి రోజుల్లో రైలులో సినిమా సన్నివేశాలు చిత్రీకరించాం అంటే ఒక పెద్ద ప్రాసెస్ గా ఉండేది. రైల్వే శాఖ నుంచి అనుమతి పొందడానికి నెలలు తరబడి  సమయం పట్టేది. 2021 వరకు ఒరిజినల్ రైల్వే స్టేషన్లోగాని, ట్రైన్ సన్నివేశాలు చిత్రీకరించడానికి చాలా కష్టపడవలసి వచ్చేది. ఎందుకంటే 17 జోనల్ అండ్ బోర్డ్స్ దగ్గర అప్లికేషన్ వేసి అనుమతి ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ పద్ధతి చాలా సులువుగా మారిపోయింది. FFO.Govt.In అనే వెబ్సైట్ ద్వారా చాలా సులువుగా మారిపోయింది.

Atharintiki dharedi movie station seen

ట్రైన్ లో సినిమా షూటింగ్ చేయాలంటే దాదాపు ఒక లక్ష వరకు ఛార్జ్ అవుతుంది.  ఈ లక్ష ఖర్చు అనేది  2008  వరకూ వర్తించేది. ప్రస్తుతం మారుతున్న విలువ బట్టి ట్రైన్లో సన్నివేశాలు చిత్రీకరించడానికి చార్జెస్ బాగా పెరిగాయి. ఒక 4 కోచ్ లు ఉన్న స్పెషల్ ట్రైన్ మరియు ఒక SLR కూడ ఉన్న ట్రైన్లో సన్నివేశాలు చిత్రీకరించారు అంటే ఒక రోజుకి 4.74 lakhs వరకు ఖర్చు అవుతుంది. ఇది 2015లో లెక్క ప్రకారం. ఇలా చెల్లించినందుకు దాదాపు రెండు వందల కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు.

Indian train

జస్ట్ 2 రెండు బోగిలు మాత్రమే ఉండి ఈ సన్నివేశాలు చిత్రీకరించాలంటే ఒక కిలోమీటర్ కి 1044 రూపాయలుతో పాటు అదనపు చార్జెస్ కూడా ఉంటాయి. ఇలా సినిమా షూటింగులతో 2021 లెక్కల ప్రకారం సెంట్రల్ రైల్వే 2 కోట్ల, 48లక్షల రూపాయల సంపాదనను రాబట్టుకుంది.


End of Article

You may also like