“విజయ్‌” కొత్త సినిమా అంగీకరించడం వెనుక ఉన్న కారణం ఇదేనా..?

“విజయ్‌” కొత్త సినిమా అంగీకరించడం వెనుక ఉన్న కారణం ఇదేనా..?

by kavitha

Ads

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ ఏడాది వారసుడు సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాని తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. ఈ మూవీ తరువాత విజయ్‌ మరో టాలీవుడ్ డైరెక్టర్ తో మూవీ చేస్తున్నారని టాక్ వినిపించింది.

Video Advertisement

ఆ తరువాత కోలీవుడ్ దర్శకుడు వెంకట్‌ ప్రభు చెప్పిన స్టోరీని విజయ్ ఒకే చేయడం, దానిపై అధికారిక ప్రకటన రావడం కూడా జరిగిపోయింది. అయితే తెలుగు డైరెక్టర్ కథ రిజెక్ట్ చేయడానికి, వెంకట్‌ ప్రభు చెప్పిన కథను ఒకే చేయడానికి గల కారణం ఇదే అంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
vijay-dalapathyవారసుడు మూవీ తరువాత స్టార్ హీరో విజయ్‌ దళపతి మరో తెలుగు దర్శకుడితో చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ దర్శకుడే గోపీచంద్‌ మలినేని. ఈ ఏడాది వీరసింహారెడ్డితో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ హీరో విజయ్‌ ను కలిసి కథ వినిపించించారని, మొదటి సిట్టింగ్‌లోనే విజయ్ కథను ఓకే చేశారని టాక్ వచ్చింది. గోపీచంద్ చెప్పిన స్టోరీ  విజయ్‌కి బాగా నచ్చిందని కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి. దాంతో వీరిద్దరి కాంబో పై అధికారిక ప్రకటన వస్తుందని  అంతా భావించారు.
gopichand-malineniకానీ, అదే టైంలో విజయ్ దళపతి తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో మూవీని అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. గోపీచంద్ తర్వాత డైరెక్టర్ వెంకట్ ప్రభు విజయ్‌కి స్టోరి వినిపించారు. దాంతో గోపీచంద్ చెప్పిన స్టోరి పక్కన పెట్టారు. కారణం ఏమిటా అని ఆరా తీసిన తమిళ మీడియా వార్తల ప్రకారం, వచ్చే రెండు ఏళ్లలో విజయ్ దళపతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుంది అని చెబుతున్నారు.
వెంకట్‌ ప్రభు చెప్పిన కథలో లోకల్‌ కంటెంట్‌ మరియు స్థానిక రాజకీయాల గురించి ప్రస్తావన ఉంటుందట. అందుకే ఈ కథను ఒకే చేశారని, ఈ మూవీని వచ్చే ఏడాది మొదట్లో రిలీజ్ చేసి, ఆ తర్వాత పాలిటిక్స్ వైపు వస్తారని అంటున్నారు. ఇటీవల విజయ్ మూడేళ్ళ పాటు సినిమాలకు విరామం ఇస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి.

Also Read: “అన్ని సినిమాలు కలిపి చూసినట్టు ఉంది..!” అంటూ… షారూఖ్ ఖాన్ “జవాన్” ప్రివ్యూపై 15 మీమ్స్..!


End of Article

You may also like