Ads
అంకుశం రామిరెడ్డి గురించి 90ల తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో విలన్ గా రామిరెడ్డి ఏ రేంజ్ లో ప్రేక్షకులను కనికట్టు చేశారంటే ‘అంకుశం’ మూవీ తరువాత ఆయనను చూస్తేనే తిట్టు కునేవారంట.
Video Advertisement
ఇక అమ్మోరు మూవీలో చూసిన తరువాత ఆడవాళ్ళు రామిరెడ్డిని చూస్తేనే భయపడేవారంట. అంతగా తన నటనతో విలనిజానికి కొత్త అర్థాన్ని ఇచ్చిన నటుడు రామిరెడ్డి. కానీ రియాల లైఫ్ లో రామిరెడ్డికి చాలా నిర్మలమైన వ్యక్తిగా పేరుంది. తెలుగులోనే కాదు బాలీవుడ్ ను ఏలిన యాక్టర్ రామిరెడ్డి. రామిరెడ్డి టాలీవుడ్ లో అంకుశం సినిమా ద్వారా నట జీవితాన్ని మొదలుపెట్టారు. ఈ మూవీలో ‘స్పాట్ పెడుతా’ అనే ఒక్క డైలాగ్‌తో ఆడియెన్స్ భయపడేలా చేశారు. దాంతో ఆయన పేరు అంకుశం రామిరెడ్డిగా మారింది. అసలు పేరు గంగసాని రామిరెడ్డి, ఆ మూవీ తరువాత వరుసగా అవకాశాలు రావడంతో అప్పట్లో ఉన్న స్టార్ హీరోలందరితోనూ నటించారు. రామి రెడ్డి ఇండియాలోని అన్ని భాషల సినిమాలలో నటించారు.
1959లో జనవరి 1న జన్మించిన రామిరెడ్డి కెరీర్ మొదట్లో సినిమాల వైపు దృష్టి సారించలేదు. జర్నలిస్ట్ కావాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ చేశారు. అది పూర్తి కాగానే ఒక వార్తాపత్రికలో జర్నలిస్ట్‌గా చేరారు. అందులో భాగంగా సినీ సెలెబ్రెటీల ఇంటర్వ్యూలను రామిరెడ్డి తీసుకునేవారు. ఆ క్రమంలో రామిరెడ్డి ఒకసారి ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ ఇంటర్వ్యూ కోసం వెళ్లారు. అప్పుడు రామిరెడ్డి ప్రతిభను చూసి ముగ్ధుడైన కోడి రామకృష్ణ తను తీయబోయే సినిమాలో రామిరెడ్డికి విలన్ క్యారెక్టర్ ఇచ్చారు.
అలా వీరిద్దరి కాంబోలో వచ్చిన మూవీనే అంకుశం. ఈ మూవీ రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీనే రామిరెడ్డి కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ మూవినే బాలీవుడ్ లో ప్రతిబంధ్ టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేశారు. ఆ మూవీలో కూడా విలన్ గా రామిరెడ్డి నటించాడు. అక్కడ ప్రతిబంద్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీతో చిరంజీవి కంటే విలన్ గా నటించిన రామిరెడ్డి యాక్టింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీ ఫిదా అయింది. దాంతో బాలీవుడ్ లో రామిరెడ్డి భారీగా అవకాశాలు వచ్చాయి.
90వ దశకంలో, బాలీవుడ్‌లో రామిరెడ్డి పాపులర్ ఫేస్‌గా నిలిచారు. తెలుగు, హిందీలో నటిస్తూనే రామిరెడ్డి ఇతర భాషల్లో కూడా నటించి మెప్పించారు. అలా ఆయన కెరీర్ మొత్తంలో దాదాపు 250కి పైగా చిత్రాలలో నటించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్రిష్ పూరి, ప్రేమ్ చోప్రా, డానీ డెంజోంగ్పా,అమ్జాద్ ఖాన్, గుల్షన్ గ్రోవర్ వంటి విలన్‌లకు ఏ విధంగా తీసిపోని అరుదైన యాక్టర్ అయిన రామిరెడ్డి జీవితం మాత్రం అర్ధాంతరంగా ముగిసిపోయింది.
రామిరెడ్డి చివరి వరకు తన నటనతో ఆడియెన్స్ ని అలరించాలని కోరుకున్నారు. కానీ 2010లో ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. కాలేయ క్యాన్సర్‌తో ఉందని వైద్యులు గుర్తించి, రామిరెడ్డికి తెలిపారు. రోజురోజుకు ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆఖరి రోజుల్లో అయితే రామిరెడ్డి గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. చివరికి 2011 లో ఏప్రిల్ 14న 52 ఏళ్ల వయసులో రామిరెడ్డి కన్నుమూశారు.
చనిపోయే కొద్ది రోజుల ముందు నుండే భార్య, పిల్లలు ఏమవుతారనే ఆలోచనతో ఆయన నరకం అనుభవించారని రామిరెడ్డి సన్నిహితులు చెబుతుంటారు. రామిరెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని తెలుస్తోంది. ఆయన కుమారుడు ప్రస్తుతం తండ్రి రామిరెడ్డి పేరుతో స్వీట్ షాప్ నడుపుకుంటూ జీవిస్తున్నారని తెలుస్తోంది.
End of Article