“కోరమాండల్ ఎక్స్‌ప్రెస్” ట్రైన్ ప్రమాదం జరగడానికి కారణం ఇదేనా..? ఇలా చేయకపోయి ఉంటే..?

“కోరమాండల్ ఎక్స్‌ప్రెస్” ట్రైన్ ప్రమాదం జరగడానికి కారణం ఇదేనా..? ఇలా చేయకపోయి ఉంటే..?

by kavitha

Ads

శుక్రవారం (జూన్ 2) నాడు హౌరా నుండి చెన్నైకి వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఒడిశాలో బహనాగ్ రైల్వే స్టేషన్‌లో ఆగిన గూడ్స్ ట్రైన్ ను ఢీకొట్టడంతో కు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 7 :20 లకు జరిగినట్లు తెలుస్తోంది.

Video Advertisement

ఈ రైలు ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 237 మందికి మరణించగా, 900 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారని అధికారిక సమాచారం. గాయపడిన వారందరిని హాస్పటల్ కు తరలించారు. ఈ ఘటన పై విచారం తెలిపిన కేంద్ర రైల్వే మినిస్ట్రీ హై లెవెల్‌ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రమాదానికి గల అసలు కారణం బయటికి వచ్చింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సాఫీగా సాగిపోతున్న రైలు ప్రయాణంలో తమ రైలు పట్టాలు తప్పిందని ప్రయాణికులు తెలుసుకునేలోగా ట్రైన్స్ ఢీ కొని కొందరిని మృత్యువు కబళించింది. కొందరు స్పాట్‌లోనే, మరికొందరు బోగీల్లో ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచారు. ప్రమదస్థలం భయనకంగా మారింది. కోచ్‌లు 30 వరకు నుజ్జునుజ్జయ్యాయి. యాక్సిడెంట్ జరిగిన విధానానికి మృతదేహాలు చెల్లాచెదురు అయిపోయాయి. బోగీల్లో చిక్కుకున్న బాధితుల హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లి పోయింది. అయితే ఈ ఇంత ఘోర ప్రమాదం జరగడానికి గల కారణం బయటకు వచ్చింది.
ఇప్పటిదాకా యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌, కోరమండల్‌ ట్రైన్ ను ఢీకొడితే, అది వెళ్ళి గూడ్స్‌ ఢీకొట్టినట్టు అధికారులు చెప్పారు. అయితే అది నిజం కాదని తేలింది. జరిగిన యాక్సిడెంట్ కు సిగ్నలింగ్‌ మరియు టెలికమ్యూనికేషన్‌ ఫెయిల్యూరే కారణం. వేగంగా వస్తున్న కోరమాండల్ ట్రైన్ కి దారి ఇవ్వడం కోసం ఆ ట్రాక్ పైన ఉన్న గూుడ్స్ ని రైల్వే అధికారులు లూప్ లోకి పంపారు. అయితే 110కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న కోరమాండల్ ట్రైన్ బహెనాగ్ రైల్వే స్టేషన్ కు వచ్చాన తరువాత  సిగ్నలింగ్ లోపం వల్ల గూడ్స్ ఉన్న లూప్ లైన్లో కి వెళ్లింది.
కానీ సిగ్నల్ ప్యానెల్ లో ఆ ట్రైన్ మెయిన్ లైన్ లోనే వెళ్తున్నట్టు చూపించింది. దాంతో మెయిన్ లైన్ వెళ్తుందనుకుని లూప్ లైన్లో వెళ్లి ఆ ట్రాక్ మీద ఉన్న గూడ్స్ ట్రైన్ ని ఢీకొట్టింది. దాంతో కోరమాండల్ భోగీలు కొన్ని గూడ్స్ భోగీల మీద ఎక్కాయి. కోరమాండల్ భోగీలు కొన్ని పక్కనే ఉన్న వేరే ట్రాక్ పై పడ్డాయి. కాసేపటికి పక్క ట్రాక్ పైకి వచ్చిన యశ్వంత్ పూర్ ట్రైన్ ట్రాక్ పై పడిన కోరమాండల్ భోగీలను ఢీకొట్టింది.|
కోరమాండల్ ట్రైన్ గూడ్స్ ని ఢీకొని 16 నిముషాలు అయినా అటువైపు  వస్తుున్న యశ్వంత్ పూర్ ట్రైన్ ను మరో స్టేషన్ లో ఆపలేదు. శుక్రవారం నాడు మొత్తం  సిగ్నలింగ్ వ్యవస్థ కుప్పకూలింది. ఈ ఘోరప్రమాదానికి కారణం సిగ్నల్ మరియు టెలి కమ్యూనికేషన్ టెక్నికల్ సమస్య అని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇదంతా 15 నిముషాల వ్యవధిలోనే జరిగిందని తెలుస్తోంది.

Also Read: OTTలో ప్రవేశ పెట్టిన కొత్త రూల్ ఏమిటో తెలుసా..?


End of Article

You may also like