Ads
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హీరోగా వెలుగొందిన నటుడు ప్రశాంత్. తమిళ సినిమాల్లోనే ఎక్కువగా నటించినప్పటికీ తెలుగు, హిందీ, మలయాళ చిత్రాలలో కూడా నటించి, ఎంతోమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు.
Video Advertisement
ప్రశాంత్ ఒకప్పుడు కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఎన్నో హిట్ సినిమాలలో నటించి, ఆడియెన్స్ ను అలరించారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జీన్స్’ మూవీ ప్రశాంత్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది. కానీ ప్రశాంత్ కెరీర్ పడిపోవడానికి కారణం ఆయన లైఫ్ లో జరిగిన ఊహించని ఘటనే అని టాక్. అదేమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రశాంత్ తండ్రి ప్రముఖ కోలీవుడ్ నటుడు మరియు దర్శకుడు త్యాగరాజన్. తండ్రి దారిలోనే ప్రశాంత్ 17 ఏళ్ల వయసులోనే ‘వైగాసి పోరంతచ్చు’ అనే తమిళ మూవీ ద్వారా ఇండస్ట్రీలో కెరీర్‌ను మొదలుపెట్టాడు. కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, విజయ్ లాంటి వారు అప్పుడప్పుడే కెరీర్‌లో గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలోనే కోలీవుడ్ లో స్టార్ హీరోగా ప్రశాంత్ రాణించాడు. ఆయన కెరిర్ భారీ హిట్లతో దూసుకుపోతున్న టైమ్ లో ప్రశాంత్ కి తన భార్యతో వచ్చిన వివాదాలు, ఆ తరువాత వచ్చిన వరుస పరాజయాలతో స్టార్ స్టేటస్ ను కోల్పోయాడు.
ప్రశాంత్ గురించి తాజాగా కోలీవుడ్ సినీ విశ్లేషకుడు కాంతరాజ్ పలు విషయాలను చెప్పుకొచ్చారు. సినీ రంగంలో దశాబ్దానికి ఒకసారి మార్పులు జరుగుతాయి. వాటి వల్ల కొందరు మాత్రమే రాణిస్తూ ముందుకెళతారు. ప్రశాంత్ ప్రస్తుతం ‘అంధాగన్’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఆ మూవీకి అతని తండ్రి త్యాగరాజ్ దర్శకుడు.
ఇక ఈ మూవీ తరువాత అతని నటనకు స్వస్తి చెప్పి, వేరే ఏదైనా చేయడం మంచిదని అన్నారు. ఎందుకంటే గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేదని, అలాగే సినిమాలు మారిపోయాయి. వైవాహిక జీవితంలో ఎదురైన సమస్యల వల్లే ప్రశాంత్ కెరీర్ పోయిందని, దాంతో సినిమాలకు దూరంగా ఉన్నాడని పేర్కొన్నాడు.
2005లో ప్రశాంత్‌కి బిజినెస్ మెన్ కూతురు గృహలక్ష్మితో వివాహం జరుగగా, వారికి ఒక కుమారుడు జన్మించాడు. కానీ కొన్ని రోజుల్లోనే ఇద్దరి మధ్య సమస్యలు రావడంతో3 ఏళ్ల తర్వాత విడిపోయారు. ఆ తరువాత గృహలక్ష్మి పుట్టింటికి వెళ్లి అక్కడే పాపకు జన్మనిచ్చింది. ప్రశాంత్ పాపను చూడడం కోసం వారి ఇంటికి వెళ్లినా రానివ్వలేదని తెలుస్తోంది. తన భార్య కోసం ప్రశాంత్ కోర్టుకు వెళ్ళాడు. అయితే అప్పుడే నారాయణన్ అనే వ్యక్తి గృహలక్ష్మిని ప్రశాంత్ కన్నా ముందే వివాహం చేసుకున్నానని వచ్చాడు.
అతను తమ పెళ్లి 1998లో జరిగిందని వాదించడంతో ప్రశాంత్ డైవర్స్ కు దరఖాస్తు చేయడం, కొన్నిరోజులకే విడాకులు రావడం జరిగిందని సమాచారం. ప్రశాంత్ తన కూతురుని తనతో ఉండానివ్వాలని కోరగా, దానికి కోర్టు అంగీకరించలేదు. ఇక ఈ విడాకుల టైమ్ లో ఆరోపణలు, ప్రత్యారోపణలు బయటికి రావడంతో ప్రశాంత్ కున్న ఇమేజ్ అంతా పోయింది. అలా ఆయన సినిమాలకు దూరమయ్యాడు. టాలీవుడ్ లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ మూవీలో రామ్ చరణ్‌కు అన్నగా ప్రశాంత్ నటించాడు.
Also Read: శ్రీదేవితో బాలకృష్ణ ఎందుకు నటించలేదు తెలుసా.? అసలు కారణం ఇదే.!
End of Article